చైత్ర పౌర్ణమి హనుమాన్ జయంతి
(రామ కిష్టయ్య సంగన భట్ల... 9440595494)
ధర్మపురి క్షేత్రంలో హన్మాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిం చేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. చైత్ర పౌర్ణమి హన్మాన్ జయంతిగా భావించ బడుతున్న ఆ సందర్భాన్ని పుర స్కరించుకుని ఏటా ధర్మపురి క్షేత్రస్థ దేవస్థానంలో సాంప్రదాయ రీతిలో స్వామి జయంతి వేడుకలను వైభ వంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో, ఏప్రిల్ 12వ తేదీన శని వారం దేవస్థానం లోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో, అలాగే గోదావరీ తీరస్థ గడ్డ హన్మాండ్ల ఆలయంలో జన్మదిన కార్యక్రమాలను నిర్వహించడానికి
విస్తృత ఏర్పాట్లు గావిస్తున్నారు.
జయంతికి ఏర్పాట్లు ముమ్మరం
ఏప్రిల్ 12న ఆంజనేయ జయంతిని పురస్కరించుకుని, 12,13,తేదీలలో ఆంజనేయ ఆలయంలో నిర్వహించ నున్న ప్రత్యేక కార్యక్రమాలలో భాగస్వాము లయ్యేందుకు సుదూర ప్రాంత హన్మాన్ దీక్షాపరులు సాంప్రదాయా చరణలో భాగంగా విచ్చేయ నున్నారు. దేవస్థానం ఏసీ ఈఓ శ్రీనివాస్, మార్గ దర్శకత్వంలో, దేవస్థాన చైర్మన్ జక్కు రవీందర్ ధర్మ కర్తలు, సిబ్బంది పర్యవేక్షణలో, ఆలయ అర్చకులు వొద్దిపర్తి నర్సింహమూర్తి, కళ్యాణ్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలలో భాగంగా మూడు రోజుల పాటు పంచోపనిషత్ యుక్త ప్రత్యేక పూజలు, నీరాజన, మంత్రపుష్ప, తీర్ధ ప్రసాద వితరణాది కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వేలాది మంది హన్మాన్ భక్తులు 12,13 తేదీలలో హన్మాన్ దీక్షా విరమణలు చేయను నందున భక్తుల సౌకర్యార్ధం త్రాగు నీటి ఏర్పాట్లు, దేవస్థానం లోనా, బయటా చలువ పందిళ్ళు, విద్యుత్ దీపాలంకరణలు, తాత్కాలిక టెంట్లు, ప్రత్యేక క్యూలైన్ల లాంటి వసతుల మెరుగుదల చర్యలు గైకొంటున్నారు. అసంఖ్యాకులైన దీక్షా. పరులు గత వారం రోజులుగా ఉదయం నుండే సుదూర ప్రాంతాల నుండి క్షేత్రానికి ఏతెంచి, పవిత్ర నదీ స్నానాలు ఆచరించి, దైవదర్శనార్ధం బారులుతీరి ప్రధానాలయం ముందు వేచి ఉంటున్నారు.
అలాగే క్షేత్రంలోని గోదావరీ తీరస్థ, భద్రా మరియు గోదావరీ నదుల సంగమ స్థానమైన ప్రదేశంలో, గోదావరి తీరాన్ని ఆనుకుని వెలసిన, హన్మాన్ గడ్డ పేరుతో సుపరిచిత మైన భక్తాంజనేయ దేవాలయంలో వంశపారంపర్య అర్చకులు మధ్వాచారి రాంకీషన్, పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఆంజనేయ జయంతి వేడుకలను ఏటా ఘనంగా నిర్వహించే క్రమంలో విస్తృత ఏర్పాట్లు గావిస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
