మహాత్మ జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
రాయికల్ ఏప్రిల్ 11 (ప్రజా మంటలు)
మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రాయకల్ మండల్ రామాజీపేట గ్రామంలో వారి చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా . బోగ శ్రావణి
ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ
మహారాష్ట్రలో మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన జ్యోతిబాఫూలే వర్ణ వ్యవస్థతో కునారిల్లుతున్న సమాజానికి సంస్కారం నేర్పారని కొనియాడారు. అణగారిన వర్గాల ఎదుగుదలకు విద్య సరైన ఆయుధమని భావించి పాఠశాలలు నెలకొల్పారని, స్త్రీ విద్యను ప్రోత్సహించారని, బాల్య వివాహలను వ్యతిరేకించి, వితంతు పునర్వివాహానికి నాంది పలికారని వివరించారు.
అన్ని వర్గాల వారికి విద్య, ఉపాధి, రాజకీయాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేశారని చెప్పారు. బడుగుల అభ్యున్నతికి కృషిచేసిన జాతీయ నాయకులు, సంఘ సంస్కర్తల జయంతి, కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా, వారి ఆశయాలను భావితరాలకు అందించేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఆకుల మహేష్, మండల ప్రధాన కార్యదర్శి తీపి రెడ్డి రాజశేఖర్ రెడ్డి, పాక్స్ చైర్మన్ ముత్యంరెడ్డి, ఉపాధ్యక్షులు కోల శంకర్, సాయి రాజు, నరేందర్,రాజు, వట్టిమల శీను, బంటి, కంటే భూమేష్, ఎనుగంటి నాగరాజు, ఇద్ధం గంగారెడ్డి, ఆర్మూరు నరేందర్ మరియు గ్రామ నాయకులు మండల పదాధికారులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు

పోషణ పక్షం కార్యక్రమంలో మల్యాల సిడిపిఓ వరలక్ష్మి

దుబాయిలో హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
