మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటానికి నివాళులర్పించిన కోరుట్ల ఎమ్మెల్యే డా సంజయ్
కోరుట్ల ఏప్రిల్ 11 ( ప్రజా మంటలు)
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కోరుట్ల ఎమ్మెల్యే డా సంజయ్ కల్వకుంట్ల
అనంతరం పులె గురించీ మాట్లాడుతూ పులే గొప్ప సంఘ సoస్కర్త, అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసాడు. 1873 సెప్టెంబరు 24న, ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్) ను ఏర్పాటు చేశాడు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరవచ్చు. లాగ్రేంజ్‌లోని సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఫులే ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు. అతను, అతని భార్య సావిత్రిబాయి ఫులే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకులు. అతను మహిళలకు, తక్కువ కుల ప్రజలకు విద్యను అందించే ప్రయత్నాలకు ప్రసిద్ధి చెందాడు. ఫులే బాలికల కోసం మొదటి పాఠశాలను 1848లో పూణేలో ప్రారంభించాడు. అతను వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించాడు.
భారతదేశ బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభించిన మొట్టమొదటి స్థానిక భారతీయులలో ఈ జంట ఉన్నారు. విద్య యొక్క విశ్వీకరణను సమర్థించిన మొదటి సంస్కర్త కూడా ఆయనే అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు ధరిశెట్టి రాజేష్ , మాజీ కౌన్సిలర్ లు పెర్ల సత్యం,సునీల్,మురళీ, పొట్ట సురేందర్, నగేష్, అతీక్ ,అన్వార్, రహీం పాషా, ఆనంద్,పట్టణ మండల బి ఆర్ ఎస్ నాయకులు ఉన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు

పోషణ పక్షం కార్యక్రమంలో మల్యాల సిడిపిఓ వరలక్ష్మి

దుబాయిలో హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
