సభ సక్సెస్ అయ్యేనా ??
సిటీ పోలీస్ యాక్ట్ అమలు బహిరంగ సభను అడ్డుకోవడానికేనా ???
కోర్టును ఆశ్రయించనున్న బి.ఆర్.ఎస్ నేతలు
భీమదేవరపల్లి ఏప్రిల్ 7 (ప్రజామంటలు) :
నేటి నుంచి 30 రోజులపాటు అమల్లో సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉండనుంది. వరంగల్ కమిషనరేట్ పరిధిలో మీటింగులు, ఊరేగింపులను నిషేధిస్తూ వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.ఈనెల 27వ తేదీన కమిషనరేట్ పరిధిలోని ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ హై కమాండ్ ప్రకటించింది. సభ అనుమతి కోసం పోలీస్ శాఖను పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ లిఖిత పూర్వక అనుమతి కోరారు. అనుమతిపై ఇప్పటి వరకు పోలీస్ కమిషనరేట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. సిటీ పోలీస్ యాక్ట్ అమలుతో బీఆర్ఎస్ రజతోత్సవ సభ చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే సభా ఏర్పాట్లలో బీఆర్ఎస్ నేతలు నిమగ్నమయ్యారు. ఈ విషయంలో కోర్టును బీఆర్ఎస్ నేతలు ఆశ్రయించనున్నారు. ఇప్పటికే ఈ సభ కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. గత వారం రోజులుగా సిద్దిపేట ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో ఆయా ఉమ్మడి జిల్లాల నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను ఆకస్మికంగా సందర్శించిన డిఎంహెచ్ఓ

ఆశా కుటుంబానికి ఆసరగా నిలిచిన వైద్య సిబ్బంది

దుబాయిలో హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే,మాజీ మాజీ మంత్రి

యువరాజ్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి పాదయాత్ర

కాంగ్రెస్ పార్టీ చేసిన దేశ ద్రోహపు చర్యలను ఎండగడతాం

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

పోషణ పక్వాడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథి సిడిపిఓ వీరలక్ష్మి

ఎల్కతుర్తి సభకు గులాబీ సైనికులారా తరలిరండి - ఎమ్మెల్సీ కవిత గోడమీద రాతలు

ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో పోషణ జాతర

కాంగ్రెస్ వాళ్లకు బెదిరింపులు, మోసం చేయడం కొత్త కాదు - జగిత్యాల సభలో ఎమ్మెల్సీ కవిత

ట్రంప్ నిబంధనలను వ్యతిరేకించిన హార్వర్డ్ విశ్వవిద్యాలయ యాజమాన్యాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ప్రశంసించారు
.jpeg)
ఏసీబీకి చిక్కిన. చాంద్రాయణగుట్ట అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్
