అంబేద్కర్ ఆశయ సాధనే ఘనమైన నివాళి
గొల్లపల్లి (జగిత్యాల)
మార్చి 23(ప్రజా మంటలు)
ప్రభుద్ద భారత్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కార్యనిర్వాహక సభ్యులు డిక్కీ జగిత్యాల జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్ ఆధ్వర్యంలో, ప్రతి ఆదివారం, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావు రాంజీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసే కార్యక్రమం లో భాగంగా, బార్ అసోసియేషన్ అధ్యక్షులు డబ్బా లక్ష్మారెడ్డి పూలమాల వేశారు.
అంబేద్కర్ కు ఘనమైన నివాళులు అర్పిస్తూ, భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి, అంబేద్కర్ ని ప్రపంచ జ్ఞానిగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన అలాంటి మహాను భావునికి మన భారతదేశ మొత్తం రుణపడి ఉండి ,వారిని గౌరవించుకోవడం మన సాంప్రదాయం అని అన్నారు.
సీనియర్ న్యాయవాది తాండ్ర సురేందర్ మాట్లాడుతూ అంబేద్కర్ కృషి వలన ఈరోజు నేను బహుజన బిడ్డగా ఉన్నతమైన స్థానంలో ఉన్నాను ,అంబేద్కర్ కొందరి వాడి కాదు అందరివాడు భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ప్రపంచ జ్ఞాని అని మాట్లాడారు. సీనియర న్యాయవాది బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు బండ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతున్నారు, దీనిలో భాగంగా ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేస్తూ బీసీలు ,ఓసీలు ,మైనార్టీలు ,ప్రజలందరూ వారికి ఘన నివాళులు అర్పిస్తూ ,వారు అందరివాడు అందరి కొరకు అన్ని ఇచ్చిన మహానుభావుడు వారికి మనము చేసుకున్న రుణం తీర్చుకుంటున్నాము అన్నారు.
ఈ కార్యక్రమానికి నాయకులు బండ శంకర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నకుమల్ల లక్ష్మీనారాయణ, మద్దెల నారాయణ, బొంకంటి రవి అంబేద్కర్ సంఘం అధ్యక్షులు వెంగలాపూరం , రాజేష్ ప్రవీణ్ ,కంచి సురేష్ భూసారపు శ్రీనివాస్ అడ్వకేట్,పల్లె రవి, ముద్దమల్ల గంగాధర్, కాయితి శ్రీనివాస్, జయరాజ్, తక్కల్ల దేవయ్య తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
