నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: డీఎస్పీ రఘు చందర్
బుగ్గారం మార్చి22( ప్రజా మంటలు)
*ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి*
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, నేరాలను కట్టడి చేయవచ్చని జగిత్యాల డిఎస్పి రఘు చందర్ అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ప్రార్థన మందిరాల్లో దొంగతనాల నివారణ గురించి జిల్లా పోలీసుల విజ్ఞప్తి మేరకు ఈరోజు బుగ్గారం మండలంలోని యశ్వంతరావుపేట గ్రామంలో గల MAJID-E-QUBA నందు ఏర్పాటుచేసిన 10 సీసీ కెమెరాలను ముస్లిం కమిటీ పెద్దలతో కలసి డిఎస్పి రఘు చందర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం ద్వారానే నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమని,నేరాల నియంత్రణ, శాంతి భద్రతలు కాపాడేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతాయన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలు నివారించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు.రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు తదితర ఘటనలు జరిగిన పరిస్థితుల్లో సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవడానికి పోలీసులకు మూడో నేత్రంగా ఉపయోగపడుతుందన్నారు.
బుగ్గారం మండలంలోని ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు లో ముందుకు వచ్చి పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.ఈ యొక్క సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో కృషి చేసిన వారిని డీఎస్పీ అభినందించారు.
అనంతరం మసీద్ కమిటీ సభ్యులచే ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు.
ఈ యొక్క కార్యక్రమంలో ధర్మపురి సి.ఐ రాం నరసింహారెడ్డి మరియు ఎస్.ఐ శ్రీధర్ రెడ్డి, మసీద్ కమిటీ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
