రంగుల పండుగలో బీ కేర్ ఫుల్...డాక్టర్ కళ్యాణ చక్రవర్తి
* హోలీ సెలబ్రేషన్స్ లో ఈ జాగ్రత్తలు పాటించండి..
* గాంధీ ఆర్ఎంవో డాక్టర్ కళ్యాణ చక్రవర్తి
సికింద్రాబాద్ మార్చి 13 (ప్రజామంటలు) :
నేడు రంగుల పండుగ హోళీ..చిన్న, పెద్ద అంతా ఎంతో హుషారుగా, సంతోషంగా జరుపుకునే రంగుల కేళీ ఇది. అయితే ఇటీవల కాలంలో సహజసిద్దమైన రంగులకు బదులు హానికరమైన రసాయనలతో తయారు చేసే రంగులను వాడుతుండటం ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. హోలీ సెలబ్రేషన్స్ ల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు , ఎలాంటి రంగులు వాడాలో గాంధీ ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ కళ్యాణ చక్రవర్తి వివరించారు.
రసాయన రంగులతో ఇబ్బందులు:
హోలీ రంగులు చర్మం, కళ్ళు, జుట్టు లపై ప్రభావం చూపుతాయి. అందువలన రంగులు వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. రసాయన రంగులు చర్మంపై మంట, దురద కలిగిస్తాయి. కళ్ళలో మంట వంటి సమస్యలను కలిగిస్తాయి. కొన్ని ప్రమాదకరమైన రంగులతో కళ్ళకు తీవ్ర ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. కొన్ని రంగులు కండ్లల్లోకి పోతే కన్నీరు, కన్నీరు కారడం, కంటి చూపు మసకబారడం కలిగిస్తాయి. శ్వాస కోశ సమస్యలు కలిగే అవకాశం ఉంది. రంగుల పొడి శ్వాస కోశానికి హానికరంగా మారే ప్రమాదం ఉంది. దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంతో ఇబ్బందిని కలిగిస్తాయి. కొన్ని రంగులు పర్యావరానికి హానికలిగించి, కాలుష్యాన్ని పెంపొందిస్తాయి.
రసాయనికి రంగుల్లో విషపూరిత మెటల్ ఆధారిత పిగ్మెంట్లు, మైకా, గాజు కణికలు, ఆస్బెస్టాస్ వంటి వాటితో హోలీ రంగులను తయారు చేస్తారు.
సహజ రంగులు బెటర్:
సహాజ రంగులను ఉపయోగించడం ఎంతో శ్రేయస్కారం. పసుపు, గంధకం, పువ్వుల రంగులు, ఇతర సహాజ పదార్థాల నుంచి రంగులు తయారు చేసుకోవాలి. ముఖం, కళ్ళకు, జుట్టుకు రక్షణ ఉండే విదంగా ముసుగులు, కళ్ళద్దాలు, టోపిలు వాడాలి. చర్మంపై రంగులు పడిన వెంటనే గోరువెచ్చని నీటితో కడగాలి. పిల్లలను రసాయనికి రంగులకు దూరంగా ఉంచాలి.
ప్రజలు హోలీ రంగులను సాద్యమైనంతవరకు సహజసిద్దమైన వస్తువులతో తయారు చేసినవే వాడాలని డాక్టర్ కళ్యాణ చక్రవర్తి సూచించారు. ఏదేని రసాయనికి రంగులు చర్మంపై,కళ్ళలో పడితే వెంటనే ఆలస్యం చేయకుండా సమీపంలోని డాక్టర్ ను సంప్రదించి, చికిత్స పొందాలని పేర్కొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మానసిక పరిపక్వత,సమగ్రాభివృద్ధి క్రీడలతోనే సాధ్యం - ముత్యం రెడ్డి

ధర్మపురిలో శ్రీయోగానంద నరసింహుని తెప్పోత్సవ, డోలోత్సవం

అల వైకుంఠపురం...ఇల ధర్మపురి.. భక్తజన సంద్రమైన క్షేత్రం

జాతర ఉత్సవములో పాల్గొని పూజలు నిర్వహించిన పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత

హోళి పండుగ అందరికి కొత్త ఉత్సాహం ఇవ్వాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
.jpg)
జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల ప్రాంతాల్లో అర్ధరాత్రి జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ, గస్తీ వివరాల ఆరా
1.jpg)
జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల ప్రాంతాల్లో అర్ధరాత్రి జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ, గస్తీ వివరాల ఆరా
.jpg)
ధన్వంతరి ఆలయం లో ఘనంగా కుంకుమ అర్చన, హోళి వేడుకలు పాల్గొన్న పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత
.jpg)
ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా పూజలు, పండ్ల పంపిణీ ,యువజన విభాగం చే రక్త దానం

రంగుల పండుగలో బీ కేర్ ఫుల్...డాక్టర్ కళ్యాణ చక్రవర్తి

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించండి..

కరెంటు స్పార్క్ తో పసుపు కుప్ప దగ్నం,
