దేశ భద్రత కోసం సమత సైనికులు
-డి ఎస్ ఎస్ జిల్లా అధ్యక్షుడు కాయితి శంకర్
జగిత్యాల,మార్చి02 (ప్రజా మంటలు) సమాజహితం, దేశ భద్రత కోసం సమతా సైనిక్ ధళ్ సైనికులు ముందుండాలని సమతా సైనిక్ ధళ్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కాయితి శంకర్ పిలుపునిచ్చారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు సమతా సైనిక్ ధళ్ శిక్షణ తరగతుల కరపత్రం జిల్లా కమిటీ సభ్యులు, మాల మహానాడు నాయకులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కాయితి శంకర్ మాట్లాడుతూ జాతి, మత, కుల బేధాలు లేకుండా సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల ప్రజలను అణగారిన ప్రజల హక్కులకోసం వారిని చైతన్యం పరిచేసేందుకు, రాజ్యాంగ పరిరక్షణ కోసం సమతా సైనిక్ ధళ్ దేశవ్యాప్తంగా కృషి చేస్తున్న సంస్థ అని అన్నారు
ఈ నెల 8,9 తేదీలలో కోరుట్ల పట్టణంలోని జరిగే శిక్షణ శిబిరం లో యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు
మాల మహానాడు రాష్ట్ర నాయకులు మద్దెల నారాయణ హాజరై సమతా సైనిక దళ్ ఉద్దేశాలు సేవలను వివరిస్తూ రాష్ట్రంలో మాలలకు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడారు .
ఈకార్యక్రమంలో సమతా సైనిక్ ధళ్ ప్రధాన కార్యదర్శి మెట్టు దాస్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మ్యాదరి శ్రీహరి,డిఎస్ ఎస్ నాయకులు తక్కల దేవయ్య ,మద్దెల ఆనంద్, శేఖర్,పల్లె రవి,బాసమల్ల గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అనాధ పిల్లలైనా రెండు కుటుంబాలకు రూ.10 వేలు అందించిన సూరజ్ శివ శంకర్
.jpeg)
ఆన్లైన్ లో సట్టా నిర్వహిస్తున్న గ్యాంగ్ ఆటకట్టు

మిషన్ భగీరథ నీళ్ళు - మురికి కాలువల పాలు

లోకాయుక్త జడ్జిమెంట్, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు బే ఖాతర్ - జి.పి. నిధుల దుర్వినియోగంపై చర్యల్లో నిర్లక్ష్యం

డబ్బా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి బ్లెస్సికా కీ మెడల్ మరియు నగదు బహుమతి -అభినందనలు

నాణ్యమైన సన్నం బియ్యం పంపిణీ.

ఆడుకోడానికి బయటకి వెళ్లి తిరిగిరాని బాలుడు

ఎమ్మెల్యేకు రంజాన్ ఉగాది శుభాకాంక్షలు వెల్లువ

ఇది ప్రజాపాలన కాదు ప్రజలను, మూగజీవాలను హింసించే పాలన జెడ్పీ పూర్వ చైర్ పర్సన్ దావా వసంత

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు ఘన నివాళి - జిల్లా అదనపు కలెక్టర్ బి. ఎస్. లత

శాంతి భద్రత ల దృష్టిలో జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
