దేశం గర్వించ దగ్గ సివిల్ సర్వంట్ పరికిపండ్ల నరహరి
మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో నరహరి అనితర సేవలు
(రామ కిష్టయ్య సంగన భట్ల, సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్, కాల మిస్ట్...9440595494)
ఒక సాధారణమైన టైలర్ కుటుంబంలో జన్మించి సామాజికంగా, ఆర్థికంగా ఎన్నో ఒడిదొడుగులను ఎదుర్కొని భారతదేశం గర్వించదగిన స్థానంలో నిలిచారు శ్రీ పరికిపండ్ల నరహరి, ఐఏఎస్.
తను పదవ తరగతి చదువుతున్న రోజుల్లోనే ఐఏఎస్ అధికారి కావాలని ధృఢ సంకల్పంతో... ఆ దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో అడుగడుగున ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తన తండ్రితో మొదటి సారి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళినప్పుడు భోజనం చేయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిని ఈ రోజుకు కూడా పలు సందర్భాల్లో ఆయన గుర్తు చేసు కుంటారు. ఎన్ని కష్టాలు వచ్చిన తన గమ్యం ముందర అవి చిన్నగానే కనిపించేవనీ చెప్తారు.
ఇంటి నుండి ప్రతి నెల డబ్బులు పంపించలేని పరిస్థితి ఉండడంతో నెల వారి కర్చులకోసం ట్యూషన్స్ చెప్తూ ఇంజనీరింగ్ లో యూనివర్సిటీ టాపర్ గా నిలిచిన గొప్పతనం ఆయనది. ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసేస్, ( IES ) లో ఉత్తీర్ణత సాధించి ఒక సంవత్సరం పాటు సైంటిస్ట్ గా సేవలు అందించారు. ఆర్థిక ఇబ్బందుల వలన ఒక సంవత్సరం పాటు IES ఉద్యోగం చేసి తరువాత ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రభుత్వ స్టడీ సర్కిల్లో పూర్తి స్థాయిలో సివిల్స్ కోసం ప్రిపరేషన్ మొదలు పెట్టారు.
2001 లో సివిల్స్ లో ఆల్ ఇండియా 84వ ర్యాంక్ సాధించి మధ్య ప్రదేశ్ క్యాడర్ IAS అధికారిగా నియమింప బడ్డారు.
ఎన్నో ఆశలు, ఆశయాలతో ఆ స్థానంలో నిలిచిన వారు ప్రతి పోస్టింగ్ లో తన మార్క్ పనితనంతో ప్రజల మరియు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మన్ననలు పొందుతున్నారు. మునిసిపల్ కమిషనర్ మొదలుకొని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా మధ్య ప్రదేశ్ లోని ఎన్నో జటిలమైన సమ్యసలకు సమాధానంగా నిలిచారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అందించిన అవార్డులే వారి పని తీరుకు నిదర్శనం.
నరహరి హమారా లాడ్లి లక్ష్మి యోజన(బంగారు తల్లి) పథకం రూపొందించారు. భేటీ బచావో - భేటీ పడావో పథకానికి పునాదులు వేసారు.
సోషల్ మీడియా ద్వారా గ్రివియన్స్ మొదలుపెట్టిన మొదటి ఐఏఎస్ అధికారిగా నిలిచారు. హరియాలి (హరిత హారం) అనే కార్యక్రమంతో ఒకే రోజు లక్ష మొక్కలని నాటించారు. ఇండోర్ సిటిని స్వచ్ సర్వెక్షన్ లో క్లీనేస్ట్ సిటి ఆఫ్ ఇండియా గా నిలిపారు. ఇండోర్ జిల్లాని బహిరంగ మల మూత్ర విసర్జన రహిత జిల్లాగా నిలిపారు.
గ్వాలియర్ జిల్లాలోని 95 శాతం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మరియు జనసంద్రంగా ఉండే ప్రదేశాల్లో దివ్యాంగులకోసం కచ్చితంగా రాంప్ లు కట్టించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ద్వారా ఒక్క సంవత్సరంలో 36 లక్షల మంది యువకులకు బ్యాంకుల ద్వారా ఋణాలు ఇప్పించే కార్యక్రమం చేపట్టారు.
నరహరి ఎన్నో రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు అందుకున్నారు. వికలాంగులకోసం వారు చేసిన సేవలను మరియు స్వచ్ సర్వెక్షన్ - ఇండోర్ కు గానూ కేంద్ర ప్రభుత్వం గుర్తించి రాష్ట్రపతి అవార్డు అందించారు.
ప్రతి సంవత్సరం భారతదేశ ఉత్తమ ఐఏఎస్ అధికారులలో పలు ఏజెన్సీస్ మరియు ప్రభుత్వం ఇచ్చే జాబితాలో టాప్ 5 ఐఏఎస్ అధికారిగా నిలిచారు.
మధ్య ప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వర్తిస్తు అన్ని విజయాలు సాధించినప్పటికి తను పుట్టిన గడ్డకి సేవా చేయాలని ఆలోచనతో తన మిత్ర బృందం ద్వారా ఆలయ ఫౌండేషన్ ని స్థాపించి విద్యా, వైద్య మరియు ఉపాధి రంగాలలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
మారుమూల గ్రామాల్లో, తండాల్లో మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నారు. తలసెమ్మియా పిల్లల కోసం రక్తదాన శిబిరాలు వందలాది కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
వెయ్యి మందికి పైగా వికలాంగులకు కృత్రిమ అవయవాలు, వీల్ చైర్స్, ట్రై సైకిల్స్, వినికిడి యంత్రాలను అందించారు, నిరంతరాయంగా అందిస్తున్నారు.
ఎన్నో పాఠశాలల్లో, కళాశాలల్లో, యూనివర్సిటీలలో స్వయంగా వ్యక్తిత్వ వికాసా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మోటివేషనల్ స్పీకర్స్ ద్వారా వేల సంఖ్యలో కార్యక్రమాలు ఫౌండేషన్ ద్వారా చేపట్టారు.
కార్పొరేట్ కంపెనీలలో యువతీ, యువకులకు ఉచిత నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.
బసంతనగర్ లో శంకర వారి సహకారంతో ఆలయ ఫౌండేషన్ ఉచిత కంటి ఆసుపత్రి నిర్మించి వేల సంఖ్యలో నిరంతరాయంగా ఉచిత కంటి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు.
రాజ్యాంగ బద్ధంగా అన్ని అవకాశాలు అందరికీ దక్కాలి, నిర్ణయాత్మకమైన స్థానాల్లో అన్ని వర్గాల ప్రజలు ఉంటేనే సామాజిక న్యాయం జరుగుతుందని, నాయకులుగా ఎదిగే అవకాశం అందరికి రావాలని, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే ఆలోచన ఉన్న యువతకి లీడర్షిప్ ట్రైనింగ్ క్లాసెస్ జన అధికార సమితి ద్వారా నిర్వహిస్తున్నారు.
సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని అవకాశాలు అన్ని వర్గాలు అందిపుచ్చుకొని విధంగా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు.
నైపుణ్యం కలిగిన యువతీ యువకులకు మరియు బ్యాంకులకు వారధిగా BICCI సంస్థ ఉంటు లోన్లు వచ్చే విధంగా సహకారం అందిస్తున్నారు.
దైవం మానవ రూపేణా అన్న నానుడికి నిలువెత్తు నిదర్శనం నరహరి ఐ ఎ ఎస్...
More News...
<%- node_title %>
<%- node_title %>
మానసిక పరిపక్వత,సమగ్రాభివృద్ధి క్రీడలతోనే సాధ్యం - ముత్యం రెడ్డి

ధర్మపురిలో శ్రీయోగానంద నరసింహుని తెప్పోత్సవ, డోలోత్సవం

అల వైకుంఠపురం...ఇల ధర్మపురి.. భక్తజన సంద్రమైన క్షేత్రం

జాతర ఉత్సవములో పాల్గొని పూజలు నిర్వహించిన పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత

హోళి పండుగ అందరికి కొత్త ఉత్సాహం ఇవ్వాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
.jpg)
జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల ప్రాంతాల్లో అర్ధరాత్రి జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ, గస్తీ వివరాల ఆరా
1.jpg)
జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల ప్రాంతాల్లో అర్ధరాత్రి జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ, గస్తీ వివరాల ఆరా
.jpg)
ధన్వంతరి ఆలయం లో ఘనంగా కుంకుమ అర్చన, హోళి వేడుకలు పాల్గొన్న పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత
.jpg)
ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా పూజలు, పండ్ల పంపిణీ ,యువజన విభాగం చే రక్త దానం

రంగుల పండుగలో బీ కేర్ ఫుల్...డాక్టర్ కళ్యాణ చక్రవర్తి

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించండి..

కరెంటు స్పార్క్ తో పసుపు కుప్ప దగ్నం,
