క్యాన్సర్ బాధితుడికి 1.63 లక్షల విరాళాలు.
క్యాన్సర్ బాధితుడికి 1.63 లక్షల విరాళాలు.
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి ఫిబ్రవరి 28:
క్యాన్సర్ వ్యాధి సోకిన ఓ బాధితుడికి ఫేస్ బుక్ మిత్రులు రూ. 1.63 లక్షలు విరాళాలు అందించి అండగా నిలిచి తమ ఔదార్యం చాటారు.
ధర్మపురి మండల కేంద్రానికి చెందిన నరెందుల దామోదర్ ఓ కూరగాయల షాపులో పనిచేస్తూ , పేదరికంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
క్యాన్సర్ వ్యాధి సోకడంతో కుటుంబం ఖర్చులతో పాటు వైద్య ఖర్చులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.
వీరి దీన స్థితిని తెలుసుకున్న ధర్మపురి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేష్ ఫిబ్రవరి 3 న ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి సాయం అందించాలని కోరాడు. దాతలు స్పందించి దామోదర్ భార్య గంగాభవాని బ్యాంకు ఖాతాకు రూ. 1.63 లక్షలు విరాళాలు పంపించగా వాటి నుండి తక్షణ వైద్య ఖర్చులకు రూ. 50 వేలను స్థానిక సీఐ రాం నర్సింహరెడ్డి చేతుల మీదుగా బాధిత కుటుంబానికి పంపిణీ చేయించారు. మిగతా విరాళాలను భవిష్యత్ వైద్య ఖర్చులకు తన భార్య సేవింగ్ ఖాతాలో నిల్వ ఉంచారు. ఈ సందర్భంగా రమేష్ తో పాటు సాయం అందించిన దాతలను సిఐ అభినందించారు. కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ ఉదయ్ కుమార్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ ఆశిష్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
