రోళ్లవాగ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తరా చేయరా... మాజీ మంత్రి కొప్పుల
కళకళలాడాల్సిన రోళ్ల వాగు నీళ్ళు లేక ఎండిపోయింది - మాజీ మంత్రి కొప్పుల
జగిత్యాల ఫిబ్రవరి 25:
బీర్ పూర్ మండలంలోని రోళ్ల వాగు ప్రాజెక్టును బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతతో కలిసి మాజీ మంత్రి కొప్పుల పరిశీలించారు.
ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రోళ్ల వాగు పూర్తి చేస్తారా చేయరా అని జగిత్యాల జిల్లా ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, విప్ ను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 15 నెలలు కావస్తోంది, రోళ్ళవాగు సంబంధించి 95 శాతం పనులను బిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, మిగిలిన పని ఒ షెటర్ పెట్టడం మాత్రమే, షెటర్ పెట్టడం వలన ప్రాజెక్టు కింద ఉన్న బీర్ పూర్, ధర్మపురి మండలాల్లో అనేక గ్రామాల్లో పుష్కలంగా నీళ్ళు వచ్చే అవకాశం ఉందని అన్నారు..
15 నెలల్లో ఒక షెటర్ పెట్టడానికి చరవ తీసుకుని ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం, ఈ ప్రభుత్వం అవగాహన లేని ప్రభుత్వం అన్నారు
రోళ్ళ వాగు సంబంధించి, ఆనాడు అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉండి, జీవన్ రెడ్డి, రత్నాకర్ రావు గారి లాంటి వారు మంత్రులుగా ప్రాతినిధ్యం వహించి కూడా ఆలోచన చేయలేదని గుర్తుచేశారు
ఇదంతా టేలెంట్ ప్రాంతం గోదావరి ఒడ్డున ఉన్న పరివాహక గ్రామాలకు నీళ్ళు అందే పరిస్థితి లేదు, అయిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత కెసిఆర్ గారి నాయకత్వంలో ప్రాజెక్టుల పునరుద్ధరణ జరగాలని, నీళ్ళు ఎక్కడ ఉన్నాయో, నీళ్ళు అవకాశం ఉన్నదో ఒడిసి పట్టి, ఆ ప్రాంత రైతులకు అందించాలని గొప్ప లక్ష్యం తో తీసుకున్న గొప్ప నిర్ణయం ఈ రోళ్ళ వాగు ప్రాజెక్టు
2017 ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగింది, ఆనాడు కెసిఆర్ గానీ ఆదేశాల మేరకు హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ధర్మపురి ప్రాంతంలో 9 వే ఎకరాలు, బీర్ పూర్ లో 6 ఎకరాలకు నీళ్ళు అందించేందుకు ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయడం జరిగింది
ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు ఉండే ఫారెస్ట్ క్లియరెన్స్ రావాల్సి ఉండే మీ, ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం దానికి సంబంధించిన ప్రత్యామ్నాయంగా భూములను చూపించాలని అటవీ శాఖ కు చెబితే మా ప్రభుత్వం ఉంది కాబట్టి 850 ఎకరాల భూమిని అందించడం జరిగింది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో అనుమతులు రావడానికి 15 నెలల పట్టింది, గోదావరి లో ప్రాంతంలో 18 లిఫ్ట్ లు నడుస్తున్నాయి ఈ లిఫ్ట్ కింద 50 వేల ఎకరాల ఆయకట్టుకు ఉంది..
ఈ మధ్య లో గోదావరి లో నీళ్ళు ఎండిపోయి రైతులు పిలిస్తే దమ్మున్న పేట వద్ద పది గ్రామానికి రైతులను కలిసి సంబంధిత మంత్రి మాట్లాడితే నీళ్ళు విడుదల చేయడం జరిగిందని గుర్తు చేశారు
కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం పని చేస్తం అని మాయ మాటలు చెప్పినా అధికారంలోకి వచ్చింది
ఇంకా ఈ ప్రాజెక్టు పై అవినీతి జరిగిందని మాట్లాడిండు లక్ష్మణ్ కుమార్ మరి ఏడ అవినీతి జరిగిందో చెప్పాలి, అధికారులను అడిగితే తెలుస్తుంది
నూతనంగా ఎమ్మెల్యే గెలిచావు విషయాలపై అవగాహన లేదు, మొదలు తెలుసుకో, ప్రాజెక్టు నిర్మాణం ఎలా జరుగుతుంది, వ్యయం ఎంత, స్థల సేకరణ 60 కోట్ల నుండి 136 కోట్లు ఇప్పుడు ఎంత పెరిగిందో వీటిపై ఎప్పుడైనా రివ్యూ చేసావా మాజీ మంత్రి ప్రశ్నించారు
ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేదు
ఈ రోజు రోళ్ళ వాగు రావడానికి ప్రధాన కారణం ఒకటే గోదావరి లోనికి ఒక టిఎంసి నీళ్ళు విడుదల కు వాగ్దానం చేసి ఆఫ్ టిఎంసి నీళ్ళు విడుదల చేయడం జరిగింది, మిగిలిన టిఎంసి వదిలిన రెండు తడులకు వస్తుంది, ఆ తర్వాత నీళ్ళ సంగతి ఏంటి ..
పంటలు ఎండిపోతే రైతులకు ఎవరు సమాధానం చెప్పాలి
కావాల్సిన నీళ్ళు ఉండి కూడా నిర్వహణ లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవివేక పాలన తో అనేక ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయి
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లో మళ్లీ సొసైటీల మీద చెప్పులు పెట్టే రోజులు తెచ్చారని, పోలీస్ స్టేషన్ యురియా పెట్టి అమ్మే పరిస్థితి నెలకొంది
బోనస్ ఇస్తామని చెప్పి, అన్ని రకాల వడ్లకు, మళ్ళీ సన్న రకం వడ్లకు బోనస్ ఇస్తామని అంటిరి ఏమాయే
ఒక మండలంలో ఒక్క గ్రామాన్ని ఎంపిక చేస్తారా.. మిగిలినా గ్రామాల్లో రైతులు లేరా అని ప్రశ్నించారు
ఆలోచన ముఖ్యమంత్రి లేదు, మంత్రులకు లేదు, ఇక్కడ ఎంపికైన ఎమ్మెల్యేలకు అంతకన్నా లేదని ఎద్దేవా చేశారు
కొత్తగా ఎన్నికైడ్రు ఆపేక్షతో ఉన్నారు వారి బాగోగులు తప్పా రైతులు, ప్రాంతం అభివృద్ధిని మర్చిపోయారు
ఈ రోళ్ళ వాగు ప్రాజెక్టు కు షెటర్ పెడితే ఈ రెండు మండలాలకు, గోదావరి నీళ్ళు, అలాగే ఈ ప్రాజెక్టు నుంచి నీళ్లు అందుతాయనే నమ్మకం ఉండేది
కానీ ఒక పైపు గోదావరి ఎండిపోవట్టే, ఇటు రోళ్ళ వాగు ప్రాజెక్టు ఎండిపోవట్టే
మీరు షెటర్ పెట్టారు, ఇందులో నీళ్ళు నింపారు..
మీ షెటర్ ఎప్పుడూ పెడతారు ఈ ప్రాంతం రైతులకు నీళ్లు ఇస్తరో కచ్చితంగా చెప్పాలని డిమాండ్ చేశారు
వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి రివ్యూ నిర్వహించి, రోళ్ల వాగు ప్రాజెక్టు పనులను ప్రారంభించాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో మార్క్ ఫెడ్ చైర్మన్ లోక బాపు రెడ్డి మరియు రైతులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
మానసిక పరిపక్వత,సమగ్రాభివృద్ధి క్రీడలతోనే సాధ్యం - ముత్యం రెడ్డి

ధర్మపురిలో శ్రీయోగానంద నరసింహుని తెప్పోత్సవ, డోలోత్సవం

అల వైకుంఠపురం...ఇల ధర్మపురి.. భక్తజన సంద్రమైన క్షేత్రం

జాతర ఉత్సవములో పాల్గొని పూజలు నిర్వహించిన పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత

హోళి పండుగ అందరికి కొత్త ఉత్సాహం ఇవ్వాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
.jpg)
జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల ప్రాంతాల్లో అర్ధరాత్రి జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ, గస్తీ వివరాల ఆరా
1.jpg)
జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల ప్రాంతాల్లో అర్ధరాత్రి జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ, గస్తీ వివరాల ఆరా
.jpg)
ధన్వంతరి ఆలయం లో ఘనంగా కుంకుమ అర్చన, హోళి వేడుకలు పాల్గొన్న పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత
.jpg)
ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా పూజలు, పండ్ల పంపిణీ ,యువజన విభాగం చే రక్త దానం

రంగుల పండుగలో బీ కేర్ ఫుల్...డాక్టర్ కళ్యాణ చక్రవర్తి

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించండి..

కరెంటు స్పార్క్ తో పసుపు కుప్ప దగ్నం,
