బ్యాంకులో కుప్పకూలి,ప్రాణాలు వదిలిన అడ్వకేట్
* మారేడ్ పల్లి లో విషాద ఘటన
సికింద్రాబాద్ ఫిబ్రవరి 19 (ప్రజామంటలు) :
కోర్టు పనుల నిమిత్తం బ్యాంక్ కు వచ్చిన అడ్వకేట్ చాలన్ ఓచర్ తీసుకునే సమయంలో సడెన్ గా కుప్పకూలి స్పృహ కోల్పోయి మృతిచెందిన సంఘటన మారేడు పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నోముల వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం... సికింద్రాబాద్ సివిల్ కోర్టు సమీపంలోని పుష్పగిరి ఐ హాస్పిటల్ పక్కనున్న ఇండియన్ బ్యాంక్ మారేడు పల్లి శాఖలో పనుల నిమిత్తం బుధవారం 12 గంటల సమయంలో సికింద్రాబాద్ చిలకలగూడ ప్రాంతానికి చెందిన అడ్వకేట్ వెంకటరమణ( 57) వచ్చాడు. బ్యాంకులో చాలన్ కట్టడానికి ఓచర్ తీసుకుంటుండగా సృహతప్పి అకస్మాత్తుగా వెల్లకిలా కుప్పకూలి పడిపోయాడు. తలకు గాయం కాగా, సమాచారం అందుకున్న మారేడు పల్లి పోలీసులు వెంటనే 108 అంబులెన్స్ లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అడ్వకేట్ వెంకటరమణ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసును మారేడు పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా వెంకటరమణ గత కొన్ని ఏళ్లు గా సికింద్రాబాద్ సివిల్ కోర్టు సీనియర్ అడ్వకేట్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురు అమెరికా లో ఉండగా, రెండో కూతురు కు త్వరలో వివాహం చేయడానికి నిర్ణయించినట్లు బంధువులు తెలిపారు. కాగా హైకోర్టులో మంగళవారం జడ్జీ ఎదుట వాదనలు వినిపిస్తూ కుప్పకూలి, గుండెపోటుతో అడ్వకేట్ పసునూరు వేణుగోపాలరావు చనిపోయిన విషయం విదితమే. సిటీలో వరసగా వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు పెరిగిపోవడం కలవర పరుస్తోంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
మానసిక పరిపక్వత,సమగ్రాభివృద్ధి క్రీడలతోనే సాధ్యం - ముత్యం రెడ్డి

ధర్మపురిలో శ్రీయోగానంద నరసింహుని తెప్పోత్సవ, డోలోత్సవం

అల వైకుంఠపురం...ఇల ధర్మపురి.. భక్తజన సంద్రమైన క్షేత్రం

జాతర ఉత్సవములో పాల్గొని పూజలు నిర్వహించిన పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత

హోళి పండుగ అందరికి కొత్త ఉత్సాహం ఇవ్వాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
.jpg)
జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల ప్రాంతాల్లో అర్ధరాత్రి జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ, గస్తీ వివరాల ఆరా
1.jpg)
జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల ప్రాంతాల్లో అర్ధరాత్రి జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ, గస్తీ వివరాల ఆరా
.jpg)
ధన్వంతరి ఆలయం లో ఘనంగా కుంకుమ అర్చన, హోళి వేడుకలు పాల్గొన్న పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత
.jpg)
ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా పూజలు, పండ్ల పంపిణీ ,యువజన విభాగం చే రక్త దానం

రంగుల పండుగలో బీ కేర్ ఫుల్...డాక్టర్ కళ్యాణ చక్రవర్తి

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించండి..

కరెంటు స్పార్క్ తో పసుపు కుప్ప దగ్నం,
