కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం, నిధుల కేటాయింపులో గుండు సున్నా - తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఫిబ్రవరి 1 (ప్రజా మంటలు ) :
కేంద్ర బడ్జెట్ తూర్పు రాష్ట్రాలకు వెళ్లిందని దక్షిణాది రాష్ట్రాల వైపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చూడలేదన్నారు.
కేంద్ర బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ లో తెలంగాణ ప్రభుత్వంపై పక్షపాతం చూపుతుందని, తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టులకు బడ్జెట్ లో కేటాయింపులు లేవని ఒక పత్రిక ప్రకటన రూపంలో ఆరోపించారు.
రాష్ట్రానికి బడ్జెట్ లో నిధులు కేటాయించకపోతే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని, తెలంగాణ బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని, తెలంగాణ ప్రజలకు బీజేపీ ఎంపీలు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
పబ్లిక్ సెక్టార్ స్థానంలో ఉపాధి కల్పన కోసం చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాలి, కానీ పరిశ్రమలకు బడ్జెట్ లో కేటాయించకపోవడం విచారకరమన్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి కేంద్ర బడ్జెట్ లో ప్రాధాన్యం ఇవ్వలేదని, విద్యా, ఉపాధి అవకాశాలతోనే పేదరికాన్ని రూపు మాపవచ్చు, కానీ వాటికి బడ్జెట్ లో ప్రాధాన్యం లేదని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రం ఈ బడ్జెట్ లో తీవ్ర అన్యాయానికి గురవడమే కాకుండా అభివృద్ధి తిరోగమన దిశగా వెళుతుందన్నారు.
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతున్నదని, కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంపన్న వర్గాల వారికే మేలు చేస్తుందని తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.
అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన తెలంగాణ రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.