ఘనంగా ముగిసిన అష్టాదశ పురాణ సారాంశ ప్రవచనం.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఫిబ్రవరి 1(ప్రజా మంటలు) :
జిల్లా కేంద్రంలోని రామ్ బజార్లో గల ప్రముఖ వ్యాపారవేత్త బోనగిరి వెంకటేశం, అంజమ్మ పుణ్య దంపతుల గృహంలో పురాణ బ్రహ్మ బిరుదాoకితులు, బ్రహ్మశ్రీ, సభాపతి. తిగుళ్ల విషు శర్మ చే అంగరంగ వైభవంగా అష్టాదశ పురాణ వైభవ సారాంశం, ప్రవచన కార్యక్రమము గత తొమ్మిది రోజులుగా జరిగింది.
శనివారం సాయంత్రం కళ్యాణంతో ముగిసింది అని నిర్వాహకులు తెలిపారు.
ఈరోజు ప్రముఖ జ్యోతిష వాస్తు పౌరాణిక పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాలచార్య కౌశిక ముఖ్యఅతిథిగా హాజరై సనాతన వైదిక ధర్మాన్ని కాపాడుకోవాలని, పురాణ వాంగ్మయాన్ని, జనులు విడిచిపెట్టకుండా వ్యాసుడు చెప్పిన ధర్మ మార్గంలో అందరూ నడవాలని, ధర్మాన్ని పాటించాలని, దానివల్ల ధర్మం మనల్ని కాపాడుతుందని, చేసిన పాపాలు దూరమై, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలుగు తుందని,శాంతి చేకూరుతుందని, భాషణము చేశారు.
ఈనాటి కార్యక్రమంలో బోనగిరి పరివారం, మరియు సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం భక్తులు పాల్గొన్నారు.