మానసిక, శారీరక దృఢత్వాన్ని క్రీడల వల్ల సాధించవచ్చు - జిల్లా ఎస్పి అశోక్ కుమార్
జగిత్యాల జనవరి 16 (ప్రజా మంటలు)
క్రీడలతో స్నేహ భావం పొందడంతో పాటు పని ఒత్తిడి నుండి రిలీఫ్ అవడానికి క్రీడలు ఎంతో దోహదపడుతాయని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. అనునిత్యం విధులలో, నిరంతరం పనిలో నిమగ్నమైన జిల్లా పోలీసులకు ఆటవిడుపుగా జిల్లా పోలీసు వార్షిక క్రీడలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈరోజు ఉదయం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ మైదానం నందు జిల్లా ఎస్పీ పాల్గొని పోలీసు క్రీడలను ప్రారంభించారు. మొదటగా క్రీడలను ప్రారంభిస్తున్నట్లు జిల్లా ఎస్పి తెలిపారు. తదుపరి పరేడ్ మైదానం నందు జిల్లాలోని నాలుగు బృందాలుగా ఉన్నటువంటి ఉంటూ చక్కటి పరేడ్ ను నిర్వహించి ముఖ్య అతిథులకు గౌరవ వందనాన్ని అందజేయడం జరిగింది. తదుపరి స్పోర్ట్స్ జెండాను అధికారుల సమక్షంలో ఎస్పి ఆవిష్కరించడం జరిగింది. స్పోర్ట్స్ ప్రారంభమైనట్లు తెలియజేస్తున్నటువంటి బెలూన్లను గాలిలోకి వదిలి జిల్లా పోలీసు వార్షిక క్రీడలను ప్రారంభించారు. అదేవిధంగా క్రీడాజ్యోతిని క్రీడా కారులైనటువంటి వారు పరిట మైదానం చుట్టూ తిరిగి ఎస్పి కి అందజేయగా వారు క్రీడా జ్యోతిని వెలిగించారు. అనంతరం క్రీడాకారులచే ఎలాంటి రాగద్వేషాలు లేకుండా నిష్పక్షపాతంగా క్రీడలను ఆడతామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పి మాట్లాడుతూ.. మొదటగా క్రీడా పోటీలలో పాల్గొననున్న క్రీడాకారులందరికీ అభినందనలు తెలియజేస్తూ, క్రీడలు ఆడే స్ఫూర్తి గొప్పదని ప్రతి ఒక్కరూ క్రీడలను ఆడుతూ మానసిక శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవాలని తెలియజేశారు. ఇలాంటి క్రీడా పోటీల లోనే ప్రతి ఒక్కరి ప్రతిభ కనబడుతుందని తెలియజేశారు. క్రీడలలో గెలుపోటములు సహజమని ప్రతి ఒక్కరు క్రీడా స్ఫూర్తితో పోటీలలో పాల్గొనవలసిందిగా తెలియజేశారు. ప్రతిరోజు విధులు నిర్వహించే అధికారులకు, సిబ్బందికి ఆటవిడుపుగా ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహిస్తారని వాటిలో ప్రతి ఒక్కరూ పాల్గొని మానసిక ఉల్లాసాన్ని పొందవలసిందిగా తెలిపారు. ఇలాంటి క్రీడా పోటీల్లో పాల్గొనడం వల్ల ఉద్యోగుల మధ్య సఖ్యత పెరిగి, విధులలో కలిసిమెలిసి పనిచేస్తూ ఉండడం జరుగుతుందని తెలిపారు
. పరేడ్ మైదానం నందు నాలుగు బృందాలుగా ఉన్నటువంటి ఉంటూ చక్కటి పరేడ్‌ను నిర్వహించి ముఖ్య అతిథులకు వందనాన్ని అందజేయడం జరిగింది. తదుపరి స్పోర్ట్స్ జెండాను అధికారుల సమక్షంలో ఎస్పి ఆవిష్కరించడం జరిగింది.
స్పోర్ట్స్ ప్రారంభమైనట్లు ప్రారంభమైనటువంటి బెలూన్లను గాలిలోకి వదిలి జిల్లా పోలీసు వార్షిక క్రీడలను ప్రారంభించారు. అదేవిధంగా క్రీడాజ్యోతిని క్రీడా కారులైనటువంటి పరిట మైదానం చుట్టూ తిరిగి ఎస్పీ కి అందజేయగా వారు క్రీడా జ్యోతిని వెలిగించారు. అనంతరం క్రీడాకారులచే ఎలాంటి రాగద్వేషాలు లేకుండా నిష్పక్షపాతంగా క్రీడలను ఆడతామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. తొలుత క్రీడా పోటీలలో పాల్గొననున్న క్రీడాకారులకు అభినందనలు, క్రీడలు ఆడే స్ఫూర్తి ప్రతి ఒక్కరూ క్రీడలను ఆడుతూ మానసిక శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవాలని తెలియజేశారు. ఇలాంటి క్రీడా పోటీల్లోనే ప్రతి ఒక్కరికీ ప్రతిభ కనబడుతుందని తెలియజేశారు. క్రీడలలో గెలుపోటములు సహజమని ప్రతి ఒక్కరు క్రీడా స్ఫూర్తితో పోటీలలో పాల్గొనవలసిందిగా తెలియజేశారు. ప్రతిరోజు విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి ఆటవిడుపుగా ఇలాంటి క్రీడాకారులు నిర్వహిస్తున్నారని వారిలో ప్రతి ఒక్కరూ పాల్గొని మానసిక ఉల్లాసాన్ని పొందవలసిందిగా తెలిపారు. ఇలాంటి క్రీడా పోటీల్లో పాల్గొనడం వల్ల ఉద్యోగుల మధ్య సఖ్యత పెరిగి, విధుల్లో కలిసిమెలిసి పనిచేస్తూ ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా ఈ క్రీడలు రెండు రోజులపాటు నిర్వహించబడ్డాయి అందులో వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, బ్యాట్మెంటన్, అథ్లెటిక్స్, క్యారం, చెస్ లాంటి వివిధ అంశాలలో ఈ క్రీడలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ భీమ్ రావు, డిఎస్పీ లు రఘుచందర్, రాములు ,రంగా రెడ్డి ,AO శశికల,DCRB,SB IT CORE ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, ఆరిఫ్ అలీ ఖాన్, రఫీ ఖాన్, సి.ఐ లు రాంారెడ్డి, వేణుగోపాల్, రవి,కృష్ణారెడ్డి, నిరంజన్ రెడ్డి ,సురేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు కిరణ్ కుమార్,రామకృష్ణ, వేణు మరియు ఎస్. ఐలు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.