మెట్రో శబ్ధ కాలుష్యానికి చెక్​ పెట్టాలని సీపీకి ఆదేశాలు

ప్రజావాణి ఫిర్యాదుకు స్పందన

On
మెట్రో శబ్ధ కాలుష్యానికి చెక్​ పెట్టాలని సీపీకి ఆదేశాలు

మెట్రో శబ్ధ కాలుష్యానికి చెక్​ పెట్టాలని సీపీకి ఆదేశాలు
  - ప్రజావాణి ఫిర్యాదుకు స్పందన

సికింద్రాబాద్ ​నవంబర్​ 20 (ప్రజామంటలు) :

బోయిగూడ వై జంక్షన్​ వద్ద స్థానికులను  ఏండ్ల తరబడి నుంచి  ఇబ్బంది పెడుతున్న మెట్రో రైలు సౌండ్​ పొల్యూషన్​ కు చెక్​ పెట్టడానికి ఎట్టకేలకు చర్యలు ప్రారంభమయ్యాయి. వివరాలు ఇవి. గాంధీ ఆసుపత్రి మెట్రోస్టేషన్​ సమీపంలోని బోయిగూడ వైజంక్షన్​ మెట్రో ఫిల్లర్​ బీ1006 వద్ద ఉన్న మూలమలుపు వద్ద మెట్రో రైల్​ చేస్తున్న శభ్దానికి స్థానికులు  డే, నైట్​ సమయాల్లో నరకయాతన అనుభవిస్తున్నారు. మెట్రో ప్రారంభమైనప్పటి నుంచి తలెత్తిన సమస్య గురించి  ఏండ్ల తరబడిగా స్థానిక అపార్ట్​ మెంట్ వాసులు ప్రభుత్వానికి, ఎల్​ ఆండ్​ టీ మెట్రో అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి స్పందన కనిపించలేదు. బోయిగూడ మూల మలుపు వద్దకు వచ్చేసరికి మెట్రో రైలు చేస్తున్న  పెద్ద శబ్ధానికి స్థానిక అపార్ట్ మెంట్ వాసులు ఇటు పగలు, అటు రాత్రుళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా మద్యాహ్నం 55 డెసిబుల్స్​, రాత్రి 45 డెసిబుల్స్​ శబ్ధం పరిమితి ఉండాలి. కాని బోయిగూడ మెట్రో లైన్​ మూలమలుపు వద్ద మెట్రో రైలు 24 గంటల పాటు  85 డెసిబుల్స్​ వరకు శబ్దం చేస్తుండటంతో గుండె జబ్బు, తదితర రుగ్మతలు ఉన్న వారు శబ్ద కాలుష్యానికి ఇబ్బందులు పడుతున్నారు. రాత్రంతా నడిచే మెట్రో రైళ్ళతో తమకు రాత్రుళ్ళు నిద్ర  లేకుండా పోతుందని, కనీసం మద్యాహ్నం కనుకు తీయాలన్న కూడ సాధ్యం కావడం లేదని ఎం.ఎన్​.కే విఠల్​ సెంట్రల్​ కోర్లు  అపార్ట్​ మెంట్ వాసులు వాపోతున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్​ 12న అపార్ట్ మెంట్ వాసులు హైదరాబాద్​ కలెక్టర్​ కార్యాయలంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్​ కు మెట్రో రైల్​ శబ్ద కాలుష్యంపై ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు స్పందించిన కలెక్టర్​ కార్యాలయ అధికారులు మెట్రో శబ్దకాలుష్య నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఇటీవల పొల్యూషన్​ బోర్డుతో పాటు సిటీ పోలీస్​ కమిషనర్​ కు ఆదేశాలు ఇచ్చారు. జీవో నెంబర్​ 172 ప్రకారం జిల్లాల్లో సూపరింటెండెంట్​ ఆఫ్​ పోలీస్​, నగరాల్లో పోలీస్​ కమిషనర్​ లు సౌండ్ పొల్యూషన్​ కంట్రోలింగ్​ కు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.  ఈ క్రమంలో బుధవారం గాంధీ నగర్​ పోలీస్ అధికారులు అపార్ట్ మెంట్ అసోసియేషన్​ ప్రెసిడెంట్ డాక్టర్​ హనుమండ్లు ను పిలిచి, మెట్రో శబ్ద కాలుష్యం పై వివరాలు అడిగి తెలుసుకొని, స్టేట్​ మెంట్ రికార్డు చేశారు. మెట్రో శబ్ద కాలుష్యం నివారణకు మెట్రో పట్టాల లైన్​ కు  ఇరువైపుల నాయిస్​ బారియర్స్​ (శబ్ద నియంత్రణ ఫలకలు) ఏర్పాటు చేయాలని అపార్ట్ మెంట్ ప్రెసిడెంట్​ హనుమండ్లు అధికారులకు సూచించారు. ఇదే విషయాన్ని పేర్కొంటూ పోలీస్​ అధికారులు ఎల్​ ఆండ్​ టీ మెట్రో అధికారులకు లేఖ రాశారు. ఇప్పటికైన మెట్రో శబ్దకాలుష్య నివారణకు నాయిస్​ బారియర్స్​ త్వరగా  ఏర్పాటు చేసి, తమను కాపాడాలని బోయిగూడ అపార్ట్ మెంట్​ వాసులు కోరుతున్నారు.
–––––––––––––
–ఫొటో:

Tags