రేపటి పౌరులతో నేడు బాలల దినోత్సవ వేడుకలు..
రేపటి పౌరులతో నేడు బాలల దినోత్సవ వేడుకలు
సికింద్రాబాద్ నవంబర్ 15:
నేటి పౌరులే రేపటి పౌరులు, నేటి చిన్నారులకు మంచిని బోధిస్తే వాళ్ళ ప్రవర్తన మంచిదారిలో వెళ్తుంది. నేటి చిన్నారులకు చదువుతోపాటు క్రీడల గురించి అవహగానా కలిపించి క్రీడల్లో రాణించేలా చేస్తే దేశానికే వన్నెతెచ్చే పౌరులుగా మారుతారని డాక్టర్. వై. సంజీవ కుమార్ అన్నారు.
ఇంకా ఇలా అన్నారు,అధ్యాపకులు చిన్నారులకు చదువుతోపాటు క్రమశిక్షణను నేర్పిస్తే మంచి పౌరులు కలిగే సమాజంగా తయారు అవుతుంది. భోలకపూర్ చిన్నతరగతుల ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రం చిన్నారులతో కేక్ కట్ చేయించి ఆటవస్తవులు, వివిధ రకాల తినుబండారాలను అందించి బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాము. బాలబాలికలతో పాటలు పాడించి, డాన్సులు చేయించి వాళ్లలో ఉన్న ప్రతిభను గుర్తించే ప్రయత్నం చేశాము. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దేవిక, మమత, ప్రత్యూష, సంధ్య, మంజులత ప్రెసిడెంట్ డాక్టర్. వై. సంజీవ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఓ.పావని సేవ సభ్యులు హరీష్ కుమార్, అఖిల్ మొదలగు వాళ్ళు పాల్గొన్నారు.