ధర్మపురి పుష్కరిణి వద్ద కార్తీక దీపారాధనకు అపూర్వ స్పందన

On
ధర్మపురి పుష్కరిణి వద్ద కార్తీక దీపారాధనకు అపూర్వ స్పందన

ధర్మపురి పుష్కరిణి వద్ద కార్తీక దీపారాధనకు అపూర్వ స్పందన


 (రామ కిష్టయ్య సంగన భట్ల...
   9440595494)
ధర్మపురి నవంబర్ 15:

ధర్మపురి క్షేత్రంలోని వెలసిన పౌరాణిక, ఐతిహాసిక, చారిత్రిక ప్రాధాన్యతను సంతరించుకున్న బ్రహ్మ పుష్కరిణి (కోనేరు)లో శుక్ర వారం రాత్రి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన పంచ సహస్రాధిక (ఆరు వేలకుపైగా) దీపాలంకరణ మరియు ఆరాధనకు అపూర్వ స్పందన లభించింది. కార్తీక పౌర్ణమి నాడు గతంలో అప్పటి దేవస్థాన అసిస్టెంట్ కమిషనర్ కశొజ్జల శివరామ శర్మ కాల్పనిక అపురూప ప్రదర్శనను, శర్మ రూపశిల్పిగా, శ్రమించి ఏర్పాటు చేసిన మూడు వేల దీపాలంకరణకు కొనసాగింపుగా, ఈ ఏడూ ఆరు వేల పైచిలుకు దీపాలంకరణ గావించగా, దేవస్థానం ఎసి, ఈఓ శ్రీనివాస్, సూప రింటెండెంట్ కిరణ్,  బొజ్జా రమేశ శర్మల అకుంఠిత కార్యదీక్షా ఫలితంగా, అపురూపంగా ఆరు వేల దీపాలకు పైగా కోనేటిలో అలంకరించారు. పుష్కరిణి మెట్లపై ఏర్పాటు గావించిన దీప కాంతులతో నెలరాజు జన్మదిన సందర్భంగా, భూమికి ఆరోజునే అత్యంత సమీపంగా చంద్రుడు ఏతెంచిన నేపథ్యంలో, పౌర్ణమి చంద్రుని ఆహ్వానించిన శాస్త్రీయ, చారిత్రిక ఘట్టానికి, పౌరాణిక ఇతివృత్తాన్ని జోడించి, ఆ నేపథ్యంలోనే, తిరిగి అంతకంటే ఘనంగా ఈఏడు శుక్రవారం రాత్రి సాంప్రదాయాన్ని కొనసాగించి నయనానందకరంగా నిర్వహించారు.

పుష్కరిణి మధ్య భాగాన గల భోగ మండపాన్ని తీర్చిదిద్ది, అలంకృత మండపంలో వేదికపై లక్ష్మీ దేవి, లక్ష్మీ సహిత ఉగ్ర, యోగ నరసింహ స్వాముల చిత్ర పటాలను ఉంచి, ఆలయాల అర్చకులు, వేద మూర్తులైన బొజ్జా రమేశ శర్మ సాంప్రదాయ పద్దతిలో విధివిధానంగా లక్ష్మీదేవికి గావించిన విశేష పూజలు కన్నులకు విందు చేశాయి. ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ధర్మపురి ఎమ్మేల్యే లక్ష్మణ్ కుమార్ దీపోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించగా, కరీం నగర్ డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ సత్తమ్మ, అడిషనల్ ఎస్పీ భీం రావు, మార్కెట్ చైర్ పర్సన్ లావణ్య లక్ష్మణ్, వైస్ చైర్మన్ నర్సింలు, దేవస్థానం ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ జక్కు రవి, సభ్యులు,  
 అర్చకులు భక్తులు పాల్గొన్నారు.IMG-20241115-WA0933

ఈఅపురూప ఘట్టాన్ని రాత్రి చాలాసేపటి వరకూ, భక్తులు ప్రహారీ బయట నుండి వీక్షించి, అలౌకిక ఆనందాన్ని పొంది, తరించారు. స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో కోనేరులో అవాంఛనీయాలు జరుగ కుండా భారీ బందోబస్తు ఏర్పాటు గావించారు. రాత్రి వరకూ స్థానిక గాయకులు కోనేరు భోగ మండప వేదికపై భక్తి సంగీ తాన్ని రాత్రి వరకూ వినిపించారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పంచ సహస్రాధిక దీపాలంకరణ, ఆరాధనోత్సవ విజయవంతా నికి కారణభూతులైన దేవస్థానం సిబ్బందికి, ప్రజాప్రతినిధులకు, నూనెను అందించిన దాతలకు, దీపాలను వెలిగించుటలో సహకరించిన విద్యార్థులకు, స్వచ్చంద కార్యకర్తలకు, దేవస్థానం సిబ్బందికి, అర్చకులకు, ఆర్టీసీ, విద్యుత్ అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి, పోలీసులు శాఖకు, ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి దీపారాధనలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ దేవస్థానం ఈఓ శ్రీనివాస్,  ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ జేశారు.

 గోదావరిలో స్నానాలు

ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న కార్తీక మాసోత్సవ వేడుకల సందర్భంగా మంగళ వారం క్షేత్రానికి అధిక సంఖ్యలో భక్తులు చేరు కున్నారు. కార్తీక పౌర్ణమి పర్వదిన సందర్భంగా ధర్మపురి క్షేత్రంలో భక్తుల రద్దీ అధికమైంది. కార్తీకమాసం అన్ని మాసములలో, అత్యంత పవిత్రమైన దిగా భావించ బడుతూ, ఈ మాసంలో చేయదగిన పుణ్య కార్య క్రమాలలో నదీ స్నానం, ఉపవాసం, పురాణ పఠనం, శ్రవణం, దీపారాధనం, దీప దానం, తులసిమాల ధారణం, సాలగ్రామ పూజ, దైవ పూజ, వనభోజనం కాగా, ప్రధానంగా వీటిలో విశేష పుణ్య ఫలాలను ఇచ్చేది కార్తీక స్నానంగా భావించ బడుతున్న క్రమంలో ధర్మపురి క్షేత్రానికి కార్తీక స్నానాల కోసం భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ఈ సందర్భంగా ఏటా సుదూర ప్రాంతాలనుండి భక్తులు, సాంప్రదాయాచరణాసక్తులు రావడం పరిపాటిగా మారింది. ఈనేపథ్యంలోనే నదీస్నానం, దైవ దర్శనార్ధం అశేష భక్తులు క్షేత్రానికి అరుదెంచారు. ఉదయా త్పూర్వం నుండే పవిత్ర గోదావరి నదిలో మంగళ స్నానాలు ఆచ రించారు.

Tags