హనుమకొండ  షైన్ స్కూల్‌లో హెచ్‌ఐవి,ఎయిడ్స్ అవగాహన

On
హనుమకొండ  షైన్ స్కూల్‌లో హెచ్‌ఐవి,ఎయిడ్స్ అవగాహన

హనుమకొండ  షైన్ స్కూల్‌లో హెచ్‌ఐవి,ఎయిడ్స్ అవగాహన 

హనుమకొండ అక్టోబర్ 18 (ప్రజా మంటలు) :

విద్యార్థి దశ నుండే హెచ్ఐవి, ఎయిడ్స్ పై విద్యార్థులు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని TB హాస్పిటల్ ఐసీటీసి కౌన్సిలర్ రాపర్తి సురేష్, RDMM స్వచ్చంద సంస్థ ప్రాజెక్ట్ ఈశ్వర్స సంపూర్ణ  సురక్ష కేంద్రం (SSK)  మేనేజర్  ఇక్బాల్ పాషా సూచించారు.

గురువారం హనుమకొండ లోని, రాంనగర్ బ్రాంచ్ SHINE పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ, RDMM సంస్థ ఆధ్వర్యంలో, ఐ.ఈ. సి క్యాంపెయిన్ను ప్రిన్సిపాల్ ప్రగతి రెడ్డి, అధ్యక్షతన విద్యార్థులకు హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించారు. 

ఈ కార్యక్రమంలో ఎయిడ్స్/హెచ్ఐవి ఎలా సంక్రమిస్తుంది, ఎలా వ్యాపించదు, రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చిన్న చూపు లేకుండా సమాజంలో ఎలా కలిసి జీవించాలి, హెచ్ఐవి, క్షయ వ్యాధి సంబంధం, సుఖ వ్యాధులు మరియు చికిత్స గురించి, హెచ్ఐవి యాక్ట్ 2017, ఏ.ఆర్.టి. మందులు, టోల్ ఫ్రీ నెంబర్ 1097 గురించి తెలియజేస్తూ అవగాహన కల్పించారు. 

ప్రతి ఒక్కరికీ ఈ వ్యాధి గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉన్నపుడే రాకుండా నిరోధించుకునే అవకాశం ఉంటుందన్నారు. చిన్న వయసులోనే ఆకర్షణలలో పడి బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ఎయిడ్స్ వ్యాధికి మందు లేదని, నివారణ ఒక్కటే మార్గం అన్నారు. పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొనడం ద్వారా సుఖవ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఎయిడ్స్ అంటు వ్యాధి కాదని, వ్యాధి ఉన్నవాళ్ళతో కలసి తిన్నా ఉన్నా సోకదన్నారు. 

ఈ కార్యక్రమంలో సంపూర్ణ సురక్ష కేంద్రం ఔట్రిచ్ వర్కర్, రాజేంద్ర ప్రసాద్, RDMM స్వచ్చంద సంస్థ ఔట్రిచ్ వర్కర్ ఎస్.అక్షర, A.N.M యధా లక్ష్మి, షైన్ పాఠశాల సిబ్బంది రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

Tags