సిరిసిల్ల వారి ఇంట అలరించిన సంగనభట్ల నరేంద్ర శర్మ భక్తి సంగీత విభావరి.
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల అక్టోబర్ 8 (ప్రజా మంటలు) :
బ్రాహ్మణ వీధి ఆది దుర్గాదేవి నివాసంలో దుర్గ శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు సంగనభట్ల నరేంద్ర శర్మ బృందం చే భక్తి సంగీత విభావరి కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా అమ్మవారి భక్తి గీతాలు, శివుని భక్తి గీతాలు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పై భక్తి గీతాలు వివిధ దేవి, దేవతల భక్తి గీతాల కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది.
కార్యక్రమంలో నాగరాజు, చౌటుపల్లి జనార్ధన్ తదితరులు పాల్గొని సంగీత విభావరిని అధ్యంతం భక్తులను రంజింప చేశారు.
కార్యక్రమం అనంతరం అమ్మవారి శేష వస్త్రాలతో సిరిసిల్ల కుటుంబ సభ్యులు సత్కరించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు.
Tags