దుఃఖములను దూరం చేసేది దుర్గామాత.

సాధన ద్వారా సర్వము సాధించవచ్చు.

On
దుఃఖములను దూరం చేసేది దుర్గామాత.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల అక్టోబర్ 5 (ప్రజా మంటలు):

దుఃఖములను దూరం చేసేది దుర్గామాత అని త్రిమూర్తి స్వరూపిణి అయిన అమ్మను పూజిస్తే అనుకున్నవన్నీ అందుబాటులోకి వస్తావని నంబి వాసుదేవ ఆచార్య అన్నారు.

శనివారం రాత్రి పట్టణంలోని బ్రాహ్మణ వీధి ఆది దేవి నిలయంలో నవరాత్రి ఉత్సవ మూడో రోజు నాడు దేవి లీలలు ప్రవచనాన్ని కొనసాగించారు.

ఈ సందర్భంగా అమ్మవారి లీలలను స్పూరణకు వచ్చేలా పలు సోదాహరణాలతో ప్రవచనాన్ని కొనసాగిస్తూ భాగవతము, దేవి పురాణము తదితర పురాణాల నుండి పలు అంశాలను ఉటంకించారు.

కలియుగంలో భక్తి భావన గూర్చి శంకర భగవత్పాదులు తెలిపినట్లు 8 సెకండ్ల పాటు దృష్టిని ఆధ్యాత్మికత వైపు కేంద్రీకరిస్తే ఇష్ట కామితార్థాలు సిద్ధిస్తాయని తెలిపినట్లు గుర్తుచేశారు.

సాధన ద్వారా లక్ష్యాన్ని చేరుకోవడం సులభమైనదని అన్నారు. ఆశ్వీయుజ మాసంలోనే పాడ్యమి నుండి విజయదశమి వరకు ఉన్న రోజుల్లో లక్ష్యము నెరవేరటానికి ఎంతో దోహదపడే రోజులని ఈ నవరాత్రులను సత్సంకల్పంతో నిర్వహించినట్లయితే సంకల్ప సిద్ధి తప్పక నెరవేరుతుందని తెలిపారు.

Tags