కళాకారులకు వేళాయరా !!! - కోరుకంటి రవికుమార్, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి.

On
కళాకారులకు వేళాయరా !!! - కోరుకంటి రవికుమార్, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల 26 సెప్టెంబర్ (ప్రజా మంటలు) : 

కళ లకు పట్టం కట్టడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పట్టే కార్యక్రమం యువజనోత్సవాలు.

ఈ యువజనోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఎప్పటిలాగే ఈసారి కూడా జగిత్యాల జిల్లాలో యువకళాకారుల ఎంపికకు శ్రీకారం చుట్టింది జిల్లా యంత్రాంగం. 

ఈ సందర్భంగా జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కోరుకంటి రవికుమార్ మాట్లాడుతూ... 

ప్రతిభ గలిగిన యువతను ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఉండే యువతలో ఆసక్తిని మరింతగా ప్రేరేపిస్తూ భవిష్యత్తులో గొప్ప కళాకారులను జిల్లాకు అందించే అతి గొప్ప కార్యక్రమం ఈ యువజనోత్సవాలు అని అన్నారు. 

పలు అంశాలపై ఈ కళాకారుల ఎంపిక కార్యక్రమం నిర్వహిస్తారు అని అన్నారు. ముఖ్యంగా : 

  1. సైన్స్ మేళా ( THEMATIC COMPETITION).
  2. జానపద నృత్యం బృందం మరియు వ్యక్తిగతం (FOLK DANCE GROUP & SOLO).
  3. జానపద గేయం బృందం మరియు వ్యక్తిగతం (FOLK SONGS GROUP & SOLO).
  4. యువ కృతి (హస్త కళలు, వస్త్రాలు మరియు వ్యవసాయ ఉత్పత్తులు). 
  5. లైఫ్ స్కిల్ కాంపోనెంట్.
  • కథా రచన (Story Writing).
  • కవిత్వం (Poetry).
  • వక్తృత్వ పోటీ (Declamation).
  • పెయింటింగ్ (Painting).

ఇట్టి కార్యక్రమం తేదీ: 26.09.2024 స్వామి వివేకానంద మిని స్టేడియం లో ఉదయం 09 గంటల నుండి నిర్వహిస్తామని, ఈ అవకాశాన్ని తప్పక సద్వినియోగ పరుచుకోవాలని అలాగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు ఈ సందర్భంగా అన్నారు.

Tags