పారిశుధ్య వాహనాలు, సిబ్బంది విధుల పరిశీlలించిన మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్
పారిశుధ్య వాహనాలు, సిబ్బంది విధుల పరిశీlలించిన మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్
జగిత్యాల జూలై 29 (ప్రజా మంటలు) :
పారిశుధ్య నిర్వహణ పనులను ,మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి, మున్సిపల్ కమీషనర్ సమ్మయ్య పరిశీలించారు.
జగిత్యాల పట్టణ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను, పారిశుధ్య నిర్వహణ పనులు పరిశీలించారు. ముందుగా మున్సిపల్ వాహనాలను పరిశీలించి చెత్త తరలింపు వాహనాల డ్రైవర్లుతో మాట్లాడారు. వాహనాల సంఖ్య ఎంత , చెత్త సేకరణపై మరమ్మతులకు గురైన వాహనాలను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
శానిటేషన్ సిబ్బంది అటెండెన్స్ పరిశీలించారు. ప్రతి కార్మికుడి హాజరు నమోదు తప్పనిరిగా చేయాలన్నారు.
కొత్త బస్టాండ్ ప్రాంతంలోని వాటర్ ట్యాంక్ పరిశీలించి కార్మికుల హాజరు పట్టిక పరిశీలించారు.
పారిశుద్ధ్య వాహనాలకు మరమ్మత్తులు ఉంటే వెంటనే తమ పై అధికారులకు తెలిపి మరమ్మత్తులు చేయవలసిందిగా సూచించారు మరియు వాహనాలను తమ సొంత వాహనాలు లాగా చూసుకొని విధులకు ఆటంకలకుండా చూసుకోవాలని సూచించారు.