గొల్లపల్లి పోక్సో కేసులో 60 సం.ల జైలు శిక్ష పోలీసు అధికారులకు ప్రశంసలు
గొల్లపల్లి పోక్సో కేసులో 60 సం.ల జైలు శిక్ష - పోలీసు అధికారులకు ప్రశంసలు
గొల్లపల్లి/ జగిత్యాల/హైదారాబాద్ జులై 27:
మైనర్ బాలికల పై అత్యాచారం 3 కేసులలో నిందితునికి ప్రతి కేసులో 20 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష పడడం లో కృషి చేసిన అధికారులను తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీ షికాగోయల్ అభినందించారు.
జగిత్యాల జిల్లా,గొల్లపల్లి మండలం దట్నూరు గ్రామానికి చెందిన కొడిమ్యాల హరికృష్ణ అలియాస్ హరీష్ గ్రామంలో కిరాణా దుకాణాన్ని నిర్వహిస్తుంటాడు. నిత్యవసర సరుకులు కొరకు దుకాణానికి ఒంటరిగా వచ్చే బాలికలను టార్గెట్ గా చేస్తాడు. బాలికలకు తన సెల్ ఫోన్ ఇచ్చి గేమ్స్ ఆడుకోమని చెప్పి వారిపై లైంగిక దాడి చేసేవాడు, బాలికలను బెదిరించి బైక్ పై ఎక్కించుకొని బహిరంగ ప్రదేశాలకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడేవాడు.ఈ విధంగా గ్రామంలోని ముగ్గురు బాలికలపై హరికృష్ణ లైంగిక దాడికి పాల్పడ్డాడని గ్రామానికి చెందిన ఒక వ్యక్తి హరికృష్ణ చేస్తున్న వికృతి చేష్టలను గమనించి బాలికల తల్లిదండ్రులకు సమాచారం అందించడం జరిగింది.
ముగ్గురు బాలికల తల్లులు 2022 ఏప్రిల్ 7వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద గొల్లపల్లి PS లో అప్పటి ఎస్సై శ్రీధర్ రెడ్డి కేసు నమోదు చేయగా, ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ కోటేశ్వర్, జగిత్యాల డీఎస్పీ రత్నాపురం ప్రకాష్ కేసును విచారించడం జరిగింది. సాక్షులను విచారించిన జిల్లా న్యాయమూర్తి శ్రీమతి నీలిమ నిందితుని పై నేరం రుజువు కాగా నిందితుడికి ఒక్కొక్క కేసుకు 20 సంవత్సరాల చొప్పున కఠిన కారగార శిక్ష మరియు 5000/- జరిమాన, బాధిత బాలికలకు ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చారు.
పై కేసులలో బాధిత బాలికలకు న్యాయం చేయడంలో మరియు నిందితునికి శిక్ష పడడంలో కృషి చేసిన అధికారులు డీఎస్పీ ప్రకాష్, సీ.ఐ కోటేశ్వర్, ఎస్.ఐ శ్రీధర్ రెడ్డి, పీపీ c. బాల త్రిపుర సుందరి , భరోసా సెంటర్ లీగల్ ఆఫీసర్ తేజ, కోర్ట్ కానిస్టేబుల్ శ్రీధర్ మరియు CMS టీంను ఈరోజు హైదరాబాద్ లో ఉమెన్స్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీ శ్రీమతి షిఖా గోయల్ ఐపీఎస్అభినందించి, ప్రశంసా పత్రాలు అందజేసారు. ఈ కార్యక్రమంలో DIG రెమా రాజేశ్వరి ఐపీఎస్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రశంసా పత్రాలు అందుకున్న అధికారులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్ అభినందించారు.