అంగన్వాడి కేంద్రాలను ఆకస్మిత తనిఖీ చేసిన సిడిపిఓ వాణిశ్రీ
On
అంగన్వాడి కేంద్రాలను ఆకస్మిత తనిఖీ చేసిన సిడిపిఓ వాణిశ్రీ
సారంగాపూర్ జులై 26 :
స్త్రీ శిశు సంక్షేమ శాఖ ధర్మపురి ప్రాజెక్ట్ పరిధిలోని నాగునూరు,లచ్చక్కపేట, అంగన్వాడి కేంద్రాలను శుక్రవారం ధర్మపురి సిడిపిఓ వాణిశ్రీ ఆకస్మిత తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రంలోని ఆహార పదార్థాలను , పాఠశాల లోని పరిశుభ్రతను పరిసరాలను పరిశీలించారు.
అనంతరం ఫ్రీ స్కూల్ పై విద్యా బోధన పై పిల్లలతో అడిగి తెలుసుకున్నారు. పిల్లల , ఉపాధ్యాయ నీ,ఆయాలు హాజరు పట్టికలను పరిశీలించారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్లకు, ఆయలకు, పిల్లల తల్లిదండ్రులకు అంగన్వాడి కేంద్రంలో నిర్వహించే వివిధ కార్యక్రమంల పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రేచపల్లి సెక్టార్ సూపర్వైజర్ శైలజ, అంగన్వాడి టీచర్లు ఆయాలు తల్లులు తదితరులు పాల్గొన్నారు.
Tags