రైతు రుణమాఫీ విషయంలో ఇబ్బందులు ఉంటే గ్రీన్ సెల్ ద్వారా తెలుసుకోవచ్చు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.
రైతు రుణమాఫీ విషయంలో ఇబ్బందులు ఉంటే గ్రీన్ సెల్ ద్వారా తెలుసుకోవచ్చు
జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.
జగిత్యాల జూలై 22(ప్రజా మంటలు) :
సోమవారం రోజున, కలెక్టరేట్ ఆడిటోరియంలో, కార్యాలయం నిర్వహించిన ,రుణ మాఫీ కార్యక్రమంలో, కలెక్టర్ బి , సత్య ప్రసాద్ పాల్గొన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు 2 రోజుల క్రితం రుణమాఫీ కావడం జరిగిందని,ప్రతి ఒక్క రైతు కుటుంబంలో రైతు రుణాలు ఫస్ట్ పేజ్ లో బాగా ఒక లక్ష వరకు రుణమాఫీ కావడం జరిగింది అని తెలిపారు. జగిత్యాల జిల్లాకు 39,000 వేల 523 మందికి బెన్ఫిషర్లు ఉన్నారని వారందరికీ 200, వందల 7 కోట్లు వారి ఖాతాలో జమ కావడం జరిగిందని, అలాగే ఆగస్టు 15 తేదీలో ప్రతి ఒక్క రైతుకు కచ్చితంగా రెండు లక్షల లోపు రుణమాఫీ అవుతుందని తెలిపారు.
వైట్ రేషన్ కార్డు ప్రామాణికం కాదని ఒకటి రెండు బ్యాంకులో ఇండియన్ బ్యాంకు అయినా కంప్లైంట్స్ రావడం జరిగిందని రైతు రుణమాఫీ సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే కలెక్టర్ ఆఫీసులో గ్రీన్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది తెలిపారు. అలాగే మండలంలో కూడా గ్రీన్ సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఇప్పటివరకు 30 కంప్లైంట్ గ్రీన్ సెల్ ద్వారా రావడం జరిగింది. అని అన్నారు, కుటుంబ సభ్యుల నిర్ధారణ సర్టిఫికెట్ కూడా ఇవ్వాలని 20 కాంప్లెక్స్ రావడం జరిగింది అని, అది ప్రామాణికం కాదు అని అన్నారు, ఆధార్ కార్డు మరియు బ్యాంకు వివరాలు పాస్ బుక్ వివరాలు తప్పుగా ఉన్న పేర్లు మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల కొంత మంది రైతులు ఆందోళన చేస్తున్నారు ని వారు ఎటువంటి ఇబ్బంది అవసరం లేదని వారికి బ్యాంక్ వివరాల ఆధారంగా కాండేట్ ఒక్కరూ ఐతే ఇబ్బంది ఏమి ఉండదని తెలిపారు. అలాగే పట్టాదారు పాస్ బుక్ లేదు అన్నవారు ఎమ్మార్వో ఆఫీస్ ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు.
ఈ కార్యక్రమములో వ్యవసాయ అధికారి వాణి, డిపిఆర్ఓ లక్ష్మణ్ కుమార్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ లు పాల్గొన్నారు.