జిల్లా కలెక్టర్ బుడుమజ్జి సత్యప్రసాద్ ను స్వాగతించిన జగిత్యాల టిఎన్జీవోలు
On
జిల్లా కలెక్టర్ బుడుమజ్జి సత్యప్రసాద్ ను స్వాగతించిన జగిత్యాల టిఎన్జీవోలు
జగిత్యాల జూన్ 20 (ప్రజా మంటలు )
జిల్లా కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ బుడుమజ్జి సత్యప్రసాద్ ఐ ఏ ఎస్ ని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు బోగ శశిధర్ మరియు జిల్లా కార్యదర్శి మిర్యాల నాగేందర్ రెడ్డి గార్ల ఆధ్వర్యంలో ఉద్యోగులు పుష్పగుచ్చం అందించి స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు భోగ శశిధర్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాను అని రంగాల్లో ముందు ఉంచడానికి జిల్లా ఉద్యోగులు ఎల్లవేళలా క్రృషి చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ బుడుమజ్జి సత్యప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగులందరి సహకారంతో సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు చేరవేద్దామని జిల్లాకు మంచి పేరు తీసుకొద్దామని అందరం కలిసిమెలిసి పని చేద్దామని ఉద్యోగుల సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకుందామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిఎన్జీఒ నాయకులు సాహెద్ బాబు, రవీందర్, మహమూద్, రాజేందర్, రాజేశం, సుగుణాకర్, మధుకర్, సురేందర్ నాయక్, వెంకట పవన్, సునీత్ కుమార్, నర్సయ్య, సోహేల్, మమత, శైలజ, శ్రావణి, ఇంద్రజ, శివాని, పవిత్ర, రాధిక, సుధారాణి, ఉమ, శంకరమ్మ, స్వరూప, భాగ్య, నీలిమ, లత, కవిత, విజయలక్ష్మి, రమ్య, ఉద్యోగులు పాల్గొన్నారు.
Tags