అధికారులు అందించిన సహకారం మరువలేనిది.

- జెడ్పీ చైర్మన్ దావ వసంత సురేష్.

On
అధికారులు అందించిన సహకారం మరువలేనిది.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల జూన్ 19 ( ప్రజా మంటలు ) : 

జెడ్పి చైర్ పర్సన్ గా తనకు అధికారులు కుటుంబ సభ్యులుగా ఉండి వారు అందించిన సేవలు మరువలేనివని జెడ్పి చైర్పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు.

బుధవారం పద్మనాయక మినీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాలపాటు ఎలాంటి లోటుపాట్లు లేకుండా తాను తన విధులు నిర్వహించడానికి అధికారులు మంచి సహాయ సహకారాలు అందించారని జిల్లా పరిషత్ లోని అధికారులు, అనధికారులు అందరూ తనని ఒక సోదరిగా భావించి కుటుంబ సభ్యురాలుగా తనకు అన్ని విషయాల్లో చేదోడువాదోడుగా ఉండి జిల్లా అభివృద్ధి కార్యక్రమాల్లో తోడ్పడ్డారని పేర్కొన్నారు.

సందర్భంగా జెడ్పీ సిబ్బంది అందరికీ తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తన పదవి కాలంలో పొందిన మధురస్మతులను మదిలో నిరంతరం గుర్తుంచుకుంటానని అన్నారు.

అనంతరం జెడ్పి సిబ్బందితో కలిసి ఫోటో కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags