బుగ్గారంలో రాజకీయాల కతీతంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
హర్షం వ్యక్తం చేసిన బుగ్గారం ప్రజలు
బుగ్గారం ఏప్రిల్ 14:
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో సోమ వారం రాజకీయాల కతీతంగా అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. అధికారికంగా జరిగిన ఈ అంబేద్కర్ జయంతి వేడుకల కార్యక్రమానికి బుగ్గారం పంచాయతీ సెక్రటరీ అక్బర్ తగిన ఏర్పాట్లు చేశారు. సమ న్వయంతో అన్ని పార్టీల నేతలను ఆయన ఆహ్వానించారు. అంబేద్కర్ యువజన సంఘం ముఖ్య నాయకులు సమన్వయ కర్తలుగా వ్యవహరించారు. కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్, తెలంగాణ జన సమితి, డీఎస్పీ తదితర పార్టీల నాయకులు, పుర ప్రముఖులు, మండల ప్రముఖులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు.
ఈ వేడుకలు ఘనంగా జరగడంతో బుగ్గారం మండల ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. ఇటీవలనే బిసి రిజర్వేషన్ల శాతాన్ని 42 శాతానికి పెంచడం, అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ వర్గీకరణ జీవో ను విడుదల చేయడం పట్ల, సభికులు, ప్రజలు హర్షం వ్యక్తం చేసారు.
సిఎం రేవంత్ రెడ్డి, అంబేద్కర్ ల చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. ముందుగా ఒక్కొక్కరుగా అంబెడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రముఖులు మాట్లాడారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం అంటూ నినాదాలు చేశారు. ఏర్పాట్లు ఘనంగా చేసిన పంచాయతీ కార్యదర్శి అక్బర్ సేవలను గుర్తించి రాజకీయాలకతీతంగా సభికులు అందరూ కలిసి శాలువాతో ఘనంగా అక్బర్ ను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అభిమానులు, వివిధ పార్టీల నేతలు, అంబేద్కర్ యువజన సంఘం ప్రతినిధులు, వివిధ గ్రామాల ప్రజలైన చుక్క గంగారెడ్డి, రాయిల్ల రవి కుమార్, కండ్లె మదన్, వేముల సుభాష్, నగునూరి నర్సాగౌడ్, సిగిరి అంజిత్,
నక్క జితేందర్, నక్క చెంద్రమౌళి, దూడ పోచారాజు, డా.నక్క రాజు, దూడ జీవన్, ఎండీ రహమాన్, పొన్నం సత్తయ్య గౌడ్, మూల శ్రీనివాస్ గౌడ్, జంగ శ్రీనివాస్, తాడేపు లింగన్న, కోడిమ్యాల రాజన్న, నక్క సాగర్, లతో పాటు యువకులు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం.
.jpg)
గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలు

భూ భారతి అవగాహన సదస్సుకు రైతులందరు పాల్గొనాలి - తాసిల్దార్ వరందన్

భవిష్యత్తులో బంగారం ఇంకా పెరిగే అవకాశం ఉంది

యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్ అవేర్నెస్

అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"
