డిసెంబర్ 24...జాతీయ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం

On
డిసెంబర్ 24...జాతీయ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం

డిసెంబర్ 24...జాతీయ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం


డిసెంబర్ 24...జాతీయ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం
రామ కిష్టయ్య సంగన భట్ల...
    9440595494

వస్తువులు, సేవల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణం.. వీటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొనే హక్కును కలిగి ఉండటమే వినియోగదారుల యొక్క హక్కు అని అర్థం.


భారత దేశంలో 1986లో  వినియోగ దారుల ప్రయోజనార్థం, వారి హక్కుల పరిరక్షణ కోసం  వినియోగ దారుల హక్కుల పరిరక్షణ చట్టం రూపొందించారు. భారత రాష్ట్రపతి ఆమోదంతో 1986 డిసెంబర్‌ 24న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ చట్టం ప్రకారం వినియోగ దారులకు ఆరు హక్కులు ప్రకటించింది. వినియోగ దారుల రక్షణ మానవ ప్రాణాలకు, ఆస్తికి ప్రమాద కారక వస్తువులు, సేవల నుంచి రక్షణ పొందే హక్కు... అవసరాలు తీర్చడమే కాకుండా, దీర్ఘకాలం మన్నే వస్తువులు, సేవలను పొందాలి. సమాచారం పొందే హక్కు...అవాంఛిత వ్యాపార కార్యకలాపాల నుంచి వినియోగ దారులకు రక్షణ కల్పించేందుకు వస్తు నాణ్యత, బరువు, స్వచ్ఛత, పుష్టి, ప్రమాణం గురించి తెలియ జేయాలి. నాణ్యమైన సేవలు పొందే సమాచారాన్ని తెలుసుకునే హక్కు ఉంది. వస్తువులను, సేవలను ఎంపిక చేసుకునే హక్కు...వివిధ రకాల వస్తువులు, సేవలు పొందేటప్పుడు వాటి మధ్య రేటు తెలుసు కోవడం మంచిది. సముచిత రేటులో నాణ్యత, సేవలు పొందడం. ప్రాతినిధ్యం వహించే హక్కు...వినియోగ దారుల ఆసక్తిని, వారి అవసరాలను సరైన వేదికలు, ఫోరంలలో వినిపించడం. వినియోగ దారుల సంక్షేమార్థం ఏర్పాటు చేసిన వివిధ వేదికలలో ప్రాతినిధ్యం వహించడం. వినియోగ దారుల ఫోరంలో విజ్ఞప్తి చేయడం ద్వారా సేవాలోపాలు, వస్తు లోపాల నుండి పరిహారం పొందే హక్కు... వినియోగ దారులు మోసానికి గురయినప్పుడు ఫోరంలో కేసులు వేసి, తగిన పరిహారాన్ని పొందడం. వినియోగ దారుల విద్య హక్కు... వినియోగ దారులు నిరంతరం తమ హక్కులను తెలుసుకుంటూ, తమ జ్ఞానాన్ని పెంచు కోవడం, నైపుణ్యాలను పెంపొందించు కోవడం ఎంతో అవసరం. గ్రామీణ ప్రాంతాలలో వినియోగ దారులు హక్కుల పట్ల అవగాహన లేక ఎంతో మోస పోతున్నారు. 

 నూతన వ్యాపారాభివృద్ధి సంస్కరణల వల్ల ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో, ఈ-కామర్స్‌, టెలిషాపింగ్‌ విధానంలో వస్తువుల్ని కొనుగోలు చేస్తున్నారు.  ప్రజలను మోసగించే సైబర్‌ నేరాలు దీని వల్ల  చోటుచేసు కుంటున్నాయి. వినియోగ దారులను తప్పుడు ప్రకటనలు, సందేశాలతో మోసగించడం పెరిగి పోతున్నది. దీంతో వినియోగ దారుల హక్కుల రక్షణ కోసం కొత్త చట్టాల ఆవశ్యకత ఏర్పడింది. 1986నాటి చట్టం స్థానంలో 2019లో మరో చట్టాన్ని రూపొందించారు. అది ఈ 2020 సంవత్సరంలో అమలులోకి వచ్చింది. వాణిజ్య వ్యాపారాల్లో, ప్రభుత్వ యంత్రాంగంలో, సేవా సంస్థల్లో పనిచేసే వారు నిర్లక్ష్యంగా, మోస పూరితంగా వ్యవహరించి నప్పుడు కఠిన చర్యలు తీసుకు నేందుకు ప్రపంచం లోని చట్టాలన్నింటి కన్నా మెరుగ్గా భారత దేశంలో తొలిసారి 1986లో వినియోగ దారుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని రూపొందించారు. తక్కువ సమయంలో, అతి తక్కువ రుసుముతో, దళారుల ప్రమేయం లేకుండా జిల్లా, రాష్ట్ర, జాతీయ వినియోగదారుల ఫోరాల్ని, కమిషన్లను ఆశ్రయించి వ్యక్తిగతంగా సత్వర న్యాయం పొందే సౌలభ్యం దీని ద్వారా లభించింది. ఇప్పుడు సైబర్‌ నేరాల కారణంగా దాని స్థానంలో కొత్త చట్టాన్ని తెచ్చారు. ఈ నూతన చట్టాన్ని 2020 జూలై 20 నుంచి దేశవ్యాప్తంగా అమలు పరుస్తున్నారు. 
వినియోగ దారులకు తక్కువ ఖర్చులో, ఇబ్బందులకు తావు లేని రీతిలో, శీఘ్రంగా ఫిర్యాదులను పరిష్కరించే వెసులుబాటు కల్పించాలనే సంకల్పంతో దేశ వ్యాప్తంగా వేరు వేరు స్థాయిలలో వినియోగదారు వేదికలను నెలకొల్పడం జరిగింది. వినియోగదారు రక్షణ చట్టంలోని 9వ సెక్షన్ మూడు అంచెల వివాద పరిష్కార సంస్థల ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. (ఎ) కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేసే జాతీయ వినియోగదారు వివాదాల పరిష్కార సంఘం. ఈ కోర్టునే జాతీయ సంఘంగా వ్యవహరిస్తారు. (బి). కేంద్ర ప్రభుత్వం ముందస్తు అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేసే రాష్ట్ర వినియోగదారు పరిష్కార సంఘం. ఈ కోర్టునే రాష్ట్ర సంఘంగా కూడా వ్యవహరిస్తారు. (సి). రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా ఆ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేసే వినియోగదారు వివాదాల పరిష్కార వేదిక. ఈ కోర్టునే డిస్ట్రిక్ట్ ఫోరమ్ గా కూడా వ్యవహరిస్తారు. ఈ ఏజెన్సీలన్నీ వాటి స్వభావం, అధికారాల పరంగా క్వాసీ- జ్యుడీషియల్ యంత్రాంగంగా పని చేస్తాయి.

జాతీయస్థాయిలో సెంట్రల్‌ కన్స్యూమర్‌ అథారిటీ అనే ప్రత్యేక వ్యవస్థను రూపొందించి తగిన విచారణాధికారాలు, విచక్షణాధికారాలు కల్పించారు. ఇందులో డైరెక్టర్‌ జనరల్‌ స్థాయి అధికారితో కూడిన కమిటీ ఉంటుంది. నేరాలకు పాల్పడినట్లు నిరూపితమైన వ్యక్థులపై, సంస్థలపై అవసరమైన చర్యలు తీసుకుంటారు. నూతన చట్టం ప్రకారం.. అరెస్టులు చేయించే అధికారం, మూడు సంవత్సరాల వరకు జైలు శిక్షను, పది లక్షల రూపాయల వరకూ జరిమానాను విధించే అధికారం సెంట్రల్‌ అథారిటీకి ఉంటుంది.  జిల్లా కమిషన్లు ఇచ్చిన తీర్పులపై ఉన్నత రాష్ట్రస్థాయి కమిషన్‌ను ఆశ్రయించేందుకు వ్యతిరేక పార్టీ కనీసం యాభైశాతం లేదా రూ.25 వేలు రాష్ట్ర కమిషన్‌లో డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. గతంలో ఉన్న 30 రోజులకు బదులుగా 45 రోజులుగా కాలవ్యవధిని నిర్ణయించారు. రాష్ట్ర కమిషన్‌లో ప్రెసిడెంట్‌తో పాటు విధిగా నలుగురు సభ్యులుండాలి. రెండు బెంచీలు నిర్వహించి వినియోగ దారులకు సత్వర న్యాయం అందించేందుకు కృషిచేయాలి. ఈ మేరకు రాష్ర్టాలను  కేంద్రం ఆదేశించింది. భవిష్యత్తులో జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో అధ్యక్షులు, సభ్యుల నియామకం కాలాన్ని ఐదేండ్లకు బదులు నాలుగేండ్లకు కుదించారు. గరిష్ఠ వయస్సు 65 ఏండ్లుగా నిర్ణయించారు. 

రాష్ట్ర లీగల్‌ సెల్‌ అథారిటీ ఆధ్వర్యంలో వినియోగ దారుల హక్కుల పరిరక్షణ గురించి 
 విస్తృతంగా ప్రచారం చేయాలి. నూతన వినియోగ దారుల హక్కుల పరిరక్షణ చట్టంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో, కళాశాల, విశ్వ విద్యాలయాల్లో పాఠ్య పుస్తకాల్లో, పాఠ్యాంశాల్లో వినియోగ దారుల విద్య, చట్టం ప్రాధాన్యం, అమలుపై గురించి తెలియ జేయాలి.

Tags

More News...

Local News 

సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల ఏప్రిల్ 1(ప్రజా మంటలు)సన్న బియ్యం పేదల పాలిట వరం అన్నారు శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  పట్టణ 8వ వార్డు బుడగ జంగాల కాలనీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుదారులకు ఉచిత సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ  నిరుపేదలకు...
Read More...
Local News 

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు   జగిత్యాల ఏప్రిల్ 01: బిసి రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్వర్యంలో ఏప్రిల్ 2న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించే బిసిల పోరు గర్జన మహా ధర్నా కార్యక్రమానికి జగిత్యాల జిల్లా బిసి సంక్షేమ సంఘం నాయకులు  తరలివెళ్లారు. ఈ...
Read More...
Local News 

రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు గొల్లపల్లి ఎప్రిల్ 01 (ప్రజా మంటలు)    గొల్లపల్లి మండలం చిల్వకోడూర్ గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర సందర్భంగా ఎడ్ల బండి పోటీలు నిర్వహించారు  ప్రథమ స్థానంలో  దొనకొండ.సుధీర్ శకల్ల గారి పావుతుల బంగారం మూస్క్ నిశాంతిరెడ్డి అందజేశారు   ధ్వితిమ స్థానంలో క్యతం.జితేందర్ జగదేవ్ పేట,  వారికి 10గ్రా వెండి కీర్తిశేషులు దాసరి లచ్చవ్వ -భీమయ్య...
Read More...
Local News 

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్  *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్  *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని *15 ఏండ్లుగా ప్రతి వేసవిలో అన్నదానం, చలివేంద్రం   *ఆదర్శంగా శ్రీనివాస సమాజ సేవ ఛారిటబుల్ట్రస్ట్    సికింద్రాబాద్, ఏప్రిల్ 01 (ప్రజామంటలు) :    వయస్సు పైబడిన కూడ పేద ప్రజలకు సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం చాల గొప్పదని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం సనత్ నగర్ లోని...
Read More...
Local News 

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య 

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య  గొల్లపల్లి ఎప్రిల్ 01 (ప్రజా మంటలు)    గొల్లపల్లి మండల కేంద్రంలో ఎనగందుల జయంతి 25 సం డిగ్రీ వరకు చదివి ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటున్నది. జయంతి గత కొన్ని రోజుల నుంచి కడుపు నొప్పితో  మరియు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతు జీవితంపై విరక్తి చెంది ఇంట్లో కుటుంబీకులు నిద్రిస్తున్న సమయంలో,  రూమ్ లో ఐరన్...
Read More...
Local News 

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య. గొల్లపల్లి ఎప్రిల్ 01 (ప్రజా మంటలు)      గొల్లపల్లి మండలము లోని గోవింద పల్లె గ్రామానికి చెందిన  చెందిన బింగి వెంకటమ్మ 72 సం వృద్ధురాలు కొంతకాలం నుండి  థైరాయిడ్  షుగర్ సంబంధిత వ్యాధులతో బాధ పడుతూ డాక్టర్ల సలహా మేరకు మందులు వాడుతున్నప్పటికీ  20 రోజుల క్రితం వెంకటమ్మకు కడుపులో నొప్పి రాగా, కొడుకు
Read More...
Local News 

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ సికింద్రాబాద్, ఏప్రిల్ 01 ( ప్రజామంటలు ) :    అసలే పేదరికం..ఆపై అనారోగ్య సమస్యలు..శరీరం సహకరించక మద్యలోనే చదువు ఆపేసిన  యువతికి ఓ సంస్థ అండగా నిలిచింది. వివరాలు ఇవి..బన్సీలాల్ పేట డివిజన్ జయనగర్ కు చెందిన డి.దశరథ్, వాణీ ల కుమార్తె పూజిత(17) డయాబెటిక్, థైరాయిడ్ తో బాధపడుతోంది. తన మూడేండ్ల వయస్సు నుంచే...
Read More...

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం 

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం  జగిత్యాల ఏప్రిల్ 1( ప్రజా మంటలు)  జిల్లా కేంద్రం అరవింద్ నగర్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో గత ఐదు వారాలుగా ప్రతి మంగళవారం జరుగుతున్న సామూహిక శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం ఈ  మంగళవారం ఐదో వారము కు చేరింది.  ఈనాటి హనుమాన్ చాలీసా పారాయణoలో భక్తులు  విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు...
Read More...
Local News 

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఢిల్లీ/గుంతకల్లు ఏప్రిల్ 1 (ప్రజా మంటలు)*అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో గుంతకల్ కసాపురం దేవాలయ దర్శనం కొరకు శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కూడా అందులో విలీనం చేయవలసిందిగా కోరుతూ వనగుంది విజయలక్ష్మి  బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు.. ఢిల్లీలోని కేంద్ర రైల్వే...
Read More...
Local News 

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం    మార్చి 31 (ప్రజా మంటలు)   జిల్లా కేంద్రం బైపాస్ రోడ్ లోని శ్రీ షిరిడి సాయి మందిరంలో సాయిసప్తాహం ప్రారంభమైంది. ఈరోజు సోమవారం నుండి వచ్చే సోమవారం వరకు అఖండ సాయి నామ సప్తహం జరుగుతుందని, నిర్వాహకులు తెలిపారు. సన్నిధిలో ఒక వెయ్యి ఎనిమిది కలుశాలు స్థాపించి ప్రతిరోజు పూజలు జరుగుతాయని, ఎనిమిదో రోజు మళ్లీ...
Read More...
Local News 

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు గొల్లపల్లి మార్చి 31 (ప్రజా మంటలు):    గొల్లపల్లి మండలం లోని తిర్మలాపుర్ గ్రామంలోనీ శ్రీ స్వయంభూ గుండు మల్లన్న స్వామి ఆధ్వర్యంలో ఎడ్లబండ్లు  పోటీల్లో నిర్వహించారు ఈ పోటీల్లో 16 బండ్లు పాల్గొనగా విజేతలకు    బహుమతులు అందజేశారు మొదటి బహుమతి షేక్ అక్బర్ తిర్మలపూర్ కు బాయిన లక్ష్మి- లక్ష్మయ్య పావుతున్న బంగారం అందజేశారు, ద్వితీయ...
Read More...
Local News 

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు 

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు  గొల్లపల్లి మార్చి 31 (ప్రజా మంటలు):    గొల్లపల్లి మండలం చిలువ్వ కోడూరులోని  శ్రీరామలింగేశ్వర స్వామి  జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి జాతర ఉత్సవాల్లో భాగంగా  సోమవారం రథోత్సవం నిర్వహించారు. ఆలయం నుంచి గ్రామంలోని  ప్రధాన వీధుల గుండా  నిర్వహించిన రథోత్సవాన్ని చూడటానికి మండల నలుమూల గ్రామాల  భక్తులు మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ...
Read More...