అర్హతలు ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులు రాజీవ్ ఆరోగ్యశ్రీ లోకి...
On
.jpeg)
సికింద్రాబాద్, మార్చి 28 ( ప్రజామంటలు ) :
ముప్పయి అంతకంటే ఎక్కువ పడకలు ఉన్న ప్రైవేటు ఆస్పత్రులను రాజీవ్ ఆరోగ్యశ్రీలో నమోదు చేసుకుని ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ వెంకట్ ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలను కోరారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ సహకారంతో సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ అలుమ్నీ భవనంలో శుక్రవారం ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హజరైన ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో చేరేందుకు ప్రభుత్వం సులభమైన ప్రక్రియ చేపట్టిందన్నారు. హైదరాబాద్ పరిధిలో 30 అంతకంటే ఎక్కువ పడకలు ఉన్న 105 ఆస్పత్రులు ఇప్పుటికే ఆరోగ్యశ్రీలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నారని, అర్హత ఉన్న ఆస్పత్రులు యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ ప్యానల్‌లో నమోదు (ఎంప్యానల్‌మెంట్) చేసుకోవాలని సూచించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ జనరల్ మేనేజర్ డాక్టర్ రాంబాబు మాట్లాడుతు నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆరోగ్యశ్రీ ఎంప్యానల్‌మెంట్ ఎంతో దోహదపడుతుందని, ఆరోగ్యశ్రీట్రస్ట్ వద్ద పూర్తి సమాచారం ఉచితంగా లభిస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్యశ్రీ పధకంలో ఆస్పత్రుల భాగస్వామ్యం పెంపొందించేందుకు నమోదు ప్రక్రియ సులభతరం చేసినట్లు పలువురు వక్తలు వివరించారు. ఆరోగ్యశ్రీ ఎంప్యానల్‌మెంట్ ప్రక్రియ, అవలోకనం, ఆస్పత్రుల అర్హత ప్రమాణాలు, మార్గదర్శకాలు, డాక్యుమెంటేషన్, ఎంఓయు తదితర అంశాలపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించి సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో ఎస్‌పీహెచ్‌ఓ జక్కుల రాములు, జిల్లా మాస్‌మీడియా అధికారి నరసింహా, మెడికల్ డైరక్టర్లు, ప్రొగ్రామ్ ఆఫీసర్లతోపాటు 105 ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు పాల్గొన్నాయి.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
Published On
By ch v prabhakar rao
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు
Published On
By ch v prabhakar rao

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని
Published On
By ch v prabhakar rao

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య
Published On
By ch v prabhakar rao

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.
Published On
By ch v prabhakar rao

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ
Published On
By ch v prabhakar rao

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం
Published On
By Siricilla Rajendar sharma

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
Published On
By Siricilla Rajendar sharma

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం
Published On
By Siricilla Rajendar sharma

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు
Published On
By ch v prabhakar rao

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
Published On
By ch v prabhakar rao
