హెల్త్ మినిస్టర్ గాంధీ దవఖాన ఆకస్మిక పర్యటన
డ్యూటీ డాక్టర్ల గైర్హాజర్ పై మంత్రి ఆగ్రహం
చర్యలు తీసుకోవాలని డీఎంఈ కి ఆదేశం
సికింద్రాబాద్ మార్చి 04 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. గాంధీకి రాగానే నేరుగా అవుట్ పేషెంట్ వార్డుకు వెళ్ళిన మంత్రి అక్కడున్న పేషెంట్లు, వారి సహాయకులతో మాట్లాడారు. ప్రసూతి వార్డులో అప్పుడే పుట్టిన శిశువులను పరామర్శించిన మంత్రి అక్కడున్న సౌకర్యాలపై పేషంట్లను అడిగి తెలుసుకున్నారు.
ఆసుపత్రిలో సమస్యలు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ల అటెండెన్స్ బుక్ ను తెప్పించుకొని వారి హాజరును మంత్రి పరిశీలించారు. కొందరు డాక్టర్లు గైర్హాజరు అయినట్లుగా గ్రహించిన మంత్రి ముందస్తు సమాచారం లేకుండా డ్యూటీకి గైర్హాజరైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న డీఎంఈ డా.నరేందర్ కుమార్ ను ఆదేశించారు. ఓపీ వార్డులో ఉండాల్సిన ఆయా డిపార్ట్ మెంట్ ల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు అందుబాటులో లేకపోవడంతో మంత్రి ఆగ్రహించారు.
వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చి, వివరణ తీసుకోవాలని సూపరింటెండెంట్ డా.రాజకుమారిని ఆదేశించారు. నర్సుల అటెండెన్ రిజిస్టర్ లేకపోవడంపై మంత్రి విస్మయం వ్యక్తం చేశారు. అసలు గాంధీలో పాలన యంత్రాంగం అస్తవ్యస్తంగా ఉండటంతో ఇలాంటి లోపాలు నెలకొన్నాయని మంత్రి అభిప్రాయ పడ్డారు. ఈసందర్బంగా మంత్రి ఓపీ వార్డుతో పాటు రెండో ఫ్లోర్ లోని జనరల్ మెడిసన్ ఫిమేల్ వార్డు, రేడియాలజీ డిపార్ట్ మెంట్ లోని ఎక్స్ రే, ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్, ఐవీఎఫ్ కేంద్రాలకు వెళ్ళి, పరిశీలించారు.
అయితే ఐవీఎస్ ప్రారంభమై ఏండ్లు గడుస్తున్నా ఫలితాలు ఆశించిన స్థాయిలో రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈమేరకు సంబంధిత డాక్టర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డీఎంఈ ని మంత్రి ఆదేశించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ..గాంధీలోని పలు అంశాలపై సీరియస్ గా రివ్యూ చేయాల్సి ఉందన్నారు. ఇక్కడ సాగుతున్న ఇన్ఫ్రాస్ర్టక్చర్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మెడికల్, నాన్ మెడికల్ ఉద్యోగులు ఎవరైన ఖచ్చితంగా డ్యూటీలు చేయాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవన్నారు.
గాంధీకి వచ్చే పేదలకు అందే వైద్యంలో నిర్లక్ష్యాన్ని తమ ప్రభుత్వం ఊపేక్షించదని వార్నింగ్ ఇచ్చారు. తమ ఆకస్మిక తనిఖీలు తరుచుగా కొనసాగుతాయన్నారు. మంత్రి వెంట నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్ రెడ్డి తో పాటు డీఎంఈ (అడ్మిన్) డాక్టర్ నరేందర్ కుమార్, సూపరింటెండెంట్ డా.రాజకుమారి, ఆర్ఎంవో లు, ఆయా డిపార్ట్ మెంట్ హెచ్ఓడీలు, సిబ్బంది ఉన్నారు.
తెలంగాణ భవన్ కాదు...ఇప్పుడున్నది గాంధీ భవన్..
మంత్రి దామోదర రాజనర్సింహ గాంధీ విజిట్ తర్వాత ఓపీ వార్డునుంచి బయటకు వచ్చే సమయంలో అక్కడున్న ఓ వృద్దురాలు మంత్రిని కలసి తన గోడు వెల్లబోసుకుంది. తాను సదరం సర్టిఫికెట్ గురించి తెలంగాణ భవన్ చుట్టూ తిరిగిన పని కాలేదని వాపోయింది. అందుకు స్పందించిన మంత్రి ఇప్పుడున్నది గాంధీ భవన్...ఒక్క కాగితంపై నీ సమస్య రాసి ఇస్తే పని అయిపోతుందని భరోసా ఇచ్చారు. తన ఆపీస్ అడ్రస్ తో పాటు ఫోన్ నెంబర్ రాసి ఇచ్చారు. సదరు వృద్దురాలికి కొంత ఆర్థిక సాయాన్ని అందచేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అనాధ పిల్లలైనా రెండు కుటుంబాలకు రూ.10 వేలు అందించిన సూరజ్ శివ శంకర్
.jpeg)
ఆన్లైన్ లో సట్టా నిర్వహిస్తున్న గ్యాంగ్ ఆటకట్టు

మిషన్ భగీరథ నీళ్ళు - మురికి కాలువల పాలు

లోకాయుక్త జడ్జిమెంట్, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు బే ఖాతర్ - జి.పి. నిధుల దుర్వినియోగంపై చర్యల్లో నిర్లక్ష్యం

డబ్బా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి బ్లెస్సికా కీ మెడల్ మరియు నగదు బహుమతి -అభినందనలు

నాణ్యమైన సన్నం బియ్యం పంపిణీ.

ఆడుకోడానికి బయటకి వెళ్లి తిరిగిరాని బాలుడు

ఎమ్మెల్యేకు రంజాన్ ఉగాది శుభాకాంక్షలు వెల్లువ

ఇది ప్రజాపాలన కాదు ప్రజలను, మూగజీవాలను హింసించే పాలన జెడ్పీ పూర్వ చైర్ పర్సన్ దావా వసంత

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు ఘన నివాళి - జిల్లా అదనపు కలెక్టర్ బి. ఎస్. లత

శాంతి భద్రత ల దృష్టిలో జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
