ధర్మపురిలో వైభవంగా శివరాత్రి వేడుకలు

On
ధర్మపురిలో వైభవంగా శివరాత్రి వేడుకలు

మిన్నంటిన భక్త్యావేశాలు
వివిధ ఆలయాలలో విప్ లక్ష్మణ్ కుమార్ పూజలు


(రామ కిష్టయ్య సంగన భట్ల
   9440595494)

దక్షిణకాశిగా, హరిహర క్షేత్రంగా, రాష్ట్రంలో మిగుల ప్రాచుర్యం పొందిన సనాతన సాంప్రదాయాల సిరియైన పవిత్ర గోదావరి నదీ తీరస్ధ తీర్థ మైన ధర్మ పురి 
 క్షేత్రంలో మహా శివ రాత్రి ఉత్సవ వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. మున్నెన్నడూ లేని విధంగా, పర్వదిన సందర్భంగా బుధ
వారం సుదూర ప్రాంతాలనుండి ఏతెంచిన అశేష భక్తజన సందోహంతో, సనాతన క్షేత్రం అపర కైలాస పురియై అలరారింది. రాష్ట్రం లోని సుదూర ప్రాంతాలనుండి తరతరాల వారసత్వ ఆచరణలో భాగంగా, కైలాస నాథుని దర్శనార్ధం ప్రత్యేక ప్రయివేటు వాహనాలలో, మంగళ వారం రాత్రి నుండే క్షేత్రానికి చేరుకున్న భక్తులు, యాత్రికులు గురు వారం ఉదయాత్పూర్వం నుండి పవిత్ర గోదావరిలో మంగళ స్నానాలు ఆచరించారు. శ్రీరామలింగే శ్వర, అక్కపెల్లి రాజేశ్వర, మార్కండేయ, గౌతమేశ్వ రాలయాలలో మరియు శివ పంచాయతనాల ముందు దైవదర్శనార్ధం బారులుతీరి వేచి ఉండి భక్తి శ్రద్ధలతో అభయంకరుడు, అభిషేక ప్రియుడైన శంకరునికి ప్రత్యేక పూజలొనరించారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు స్థాపించిన రామలింగేశ్వరునికి ఉదయాత్పూర్వంనుండే మహన్యాస పూర్వక ఏకా దశ రుద్రాభిషేకం, సకృతావర్తన, సహస్ర నామార్చన, అష్టోత్తర, అన్న పూజాది ప్రత్యేక కార్యక్రమాలను  విధివిదానంగా నిర్వహించారు. దేవస్థానం ఎసి, ఈఓ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, దేవస్థానం వేద పండితులు బొజ్జా రమేశ్ శర్మ, ముత్యాల శర్మ, ఆలయ అర్చకులు దేవళ్ళ విశ్వనాథశర్మ, పాలెపు ప్రవీణ్ శర్మ, స్థానిక వేదపండితులచే శ్రీరామ లింగే శ్వరాలయంలో సామూహక రుద్రాభిషేకాలు, మంత్రపుష్ప నీరాజనాది అర్చనలు, విధివిధాన పూజలు గావించారు. అత్యధిక సంఖ్యలో ముత్తయి దువలు శివాలయంలో ప్రత్యేక చండి ప్రదక్షిణలు ఆచరించారు. మండలంలో పలు గ్రామాలలో ఉత్స వాలు నిర్వహించిన కారణంగా, తగిన సంఖ్యలో లేక, పోలీసుల సహకారం కొరవడి, ఒకదశలో రద్దీ క్రమబద్ధీకరణ దేవస్థానం సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది. క్షేత్ర సమీపస్థ అక్కపెల్లి రాజేశ్వర స్వామి ఆలయంలో దేవస్థానంలో అర్చకులు ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్, సీపతి సత్యనారాయణ నేతృత్వంలోని ఉత్సవ కమిటీ సభ్యుల
ఆధ్వర్యంలో వేద పండితులచే, ప్రత్యేక పూజాది క్రతువులు నిర్వహించారు. పండితులు శివ మహాత్మ్యలను వివరించారు.   తదితరులు ప్రత్యేక పూజాదులలో పాల్గొన్నారు. స్థానిక పురపాలక సంఘం , కమిషనర్, మేనేజర్ ఆధ్వర్యంలో భక్తులకు త్రాగునీటి, విద్యుత్ సౌక ర్యాలు ఏర్పాటు చేయగా, ఆర్యవైశ్య, వర్తక సంఘం అధ్యక్షులు మురికి శ్రీనివాస్, చౌడారపు సతీష్, జక్కు రవీందర్, రాజేందర్, శంకరయ్యల నేతృత్వంలో, మున్సిపల్ కార్యాలయ నంది విగ్రహ కూడలి నుండి, అలాగే కౌన్సిలర్ జక్కు పద్మ రవీందర్ పక్షాన అక్కపెల్లి 
రాజేశ్వరాలయానికి వాహనాలను ఉచితంగా ఏర్పాటు చేసి, ప్రయాణ సౌకర్యాలు కల్పించి, ప్రశంసాపాత్రులైనారు. గోదావరీ తీరస్థ మార్కండేయ మందిరాన పద్మశాలి సేవాసంఘం ఆధ్వర్యంలో బిల్వపత్ర, ప్రత్యేక పూజలొనరించారు. ఊహించని రద్దీ పెరిగి, దేవాలయ రోడు భక్తులతో నిండి, పోలీసుల కొరతతో రద్దీ క్రమబద్ధీకరణ కష్ట సాధ్యమైంది. ధర్మపురి పోలీస్ సిబ్బంది బందోబస్తు చర్యలు చేపట్టారు. IMG-20250226-WA0489
అపర కైలాస పురియై అలరారిన ధర్మపురి

దక్షిణ కాశిగా, హరిహర క్షేత్రంగా, నవనారసింహ క్షేత్రాలలో నొకటిగా, గంభీర గౌతమీ తటమున వెలసి, వరదాయిగా, భక్తి ముక్తి ప్రదాయినిగా, నిత్య భక్తజన సందడితో అలరారుతున్న ధర్మపురి క్షేత్రం, శివరాత్రి ఉత్సవ వేడుకల సందర్భంగా, అపర కైలాస పురియై అలరారింది. రాష్ట్రంలోని మారుమూలల నుండేగాక, రాష్టేతర సుదూర ప్రాంతాల నుండి సనాతన వారసత్వ ఆచారంలో భాగంగా దైవ దర్శ నాభిలాషులై ఏతెంచిన భక్తజన బృందగానాలు, భగ వన్నామ స్మరణలు, జయజయధ్వనాలు, మంగళవా ద్యాలు, విధివిధాన వేదోక్త పూజలు, భక్తి సంగీతాలు మమేకమై క్షేత్రంలో భక్తి పారవశ్యం అంబరాన్ని చుంబించింది. పిల్లాపాపలతో, నెత్తిన మూటాముల్లె లతో, పవిత్ర గోదావరి స్నానాలాచరించి, దర్శనాలు చేసుకుని, తమ మొక్కులు చెల్లించడానికి ఒక రోజు ముందు రాత్రినుండే ఏతెంచిన భక్తుల, యాత్రికులతో  ప్రాచీన క్షేత్రం అశేష జన సంద్రమైంది. సెలవు దినాన్ని పురస్కరించుకుని క్షేత్రానికి అరుదెంచిన భక్తుల వెల్లువ పుష్కరాల సమయాన్ని తలపించింది. ప్రధాన రహదారి నిండి పోయి రాక పోకలు స్థంభించిన వేళ, క్యూలైన్లను శివాలయం వైపుకు మళ్ళించే చర్యలు చేపట్టడం శక్తికి మించిన భారమైంది. రద్దీని క్రమబద్ధీకరించడంలో తీవ్ర వైఫల్యం నెలకొంది.

వివిధ ఆలయాలలో శివరాత్రి వేడుకలు

 ధర్మపురి క్షేత్రంలోగల పౌరాణిక, ఐతిహాసిక, చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకున్న శ్రీరామ లింగేశ్వరాలయం, క్షేత్రస్థ మార్కండేయ మందిరం. శివారులోగల అక్కపెల్లి రాజేశ్వరాలయంలతోపాటు  మహా శివరాత్రి సందర్భంగా మండలం లోని వివిధ ఆలయాలు భక్తులతో కిక్కిరిసి పోయాయి. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రామలింగేశ్వరాలయంలో, ఉదయం 6గంట లనుండి సాయంత్రం 6గంటల వరకు భక్తుల అభిషేకం, రాత్రి 10 గంటల వరకు మహా లింగార్చన, మహన్యాస పూర్వక రుద్రాభిషేకాది పూజలు సాంప్ర దాయరీతిలో వేదపండితులచే నిశిపూజలు దేవ స్థానం ఎసి,ఈఓ శ్రీనివాస్, నేతృత్వంలో నిర్వహించారు. ధర్మపురి క్షేత్ర సమీపస్థ శ్రీఅక్కపెల్లి రాజేశ్వర దేవస్థానంలో, ఉత్సవ కమిటీ చైర్మన్ సత్యనారాయణ 
నేతృత్వంలో  వేదోక్త రీతిలో ఉదయం 9గంటలకు వేద పండితులు మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, మద్యాహ్నం 12 గంటలకు మహామృత్యుంజయ జపం, సాయంత్రం 6గంటలకు శివకళ్యాణం, రాత్రి 9 గంటలకు భజనలు నిర్వహించారు. మార్కండేయ మందిరంలో క్షీరాభిషేకం, బిల్వపత్రాది ప్రత్యేక పూజలు పద్మశాలి సేవాసంఘం ఆధ్వర్యంలో జరిపారు. మండలంలోని నేరేళ్ళ గ్రామ సమీపాన దట్టమైన అటనీ క్షేత్రంలోగల సాంబశివుని దేవాలయంలో శివరాత్రి సందర్భంగా వేదవిదులు భక్తజన సమక్షంలో రుద్రాభిషేకం అనంతరం కల్యాణం జరిపించారు. ప్రత్యేక కార్యక్ర మాలు నిర్వహించారు. అలాగే నేరేళ్ళ గ్రామంలోని రాజరాజేశ్వరాలయంలో పూజలు గావించారు. జైనాలో  రుద్రాభిషేకాలు నిర్వహించారు.

వివిధ ఆలయాలలో విప్ లక్ష్మణ్ కుమార్ పూజలు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని, ధర్మపురి నియోజకవర్గంలోని పలు శివాలయాలను రాష్ట్ర ప్రభుత్వ విప్, ధర్మపురి శాసనసభ్యుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 
 సందర్శించారు. ధర్మపురి నియో జకవర్గంలోని పలు గ్రామాలలో శివాలయాలలో పూజలలో పాల్గొన్న అనంతరం ధర్మపురికి విచ్చేసి, ఆయన ప్రత్యేక పర్వదిన పూజోత్సవాలలో పాల్గొన్నారు. ఆర్చకులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు సాంప్రదాయ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఘనంగా సత్కరించారు. అలాగే మాజీ మంత్రి ఈశ్వర్ కొప్పుల వివిధ ఆలయాలను సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దేవస్థానం పక్షాన పట్టువస్త్రాల సమర్పణ

ధర్మపురి క్షేత్రస్థ శ్రీరామలింగేశ్వరాలయంలో శివ రాత్రి సందర్భంగా నిర్వహించిన శివపార్వతుల కళ్యాణానికి దేవస్థానం పక్షాన ఈఓ సంకటాల శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవస్థానం ఇఓ శ్రీనివాస్,  సూపరింటెండెంట్ కిరణ్, అలువాల శ్రీనివాస్ సిబ్బంది మేళతాళాలతో వెళ్ళి, ఆర్చక పురోహితులు ప్రవీణ్, విశ్వనాథ శర్మలకు, అలాగే అక్కపెల్లి రాజేశ్వర ఆలయానికి    పట్టు వస్త్రాలు అంద జేశారు.

Tags

More News...

Local News 

మానసిక పరిపక్వత,సమగ్రాభివృద్ధి క్రీడలతోనే సాధ్యం - ముత్యం రెడ్డి

మానసిక పరిపక్వత,సమగ్రాభివృద్ధి క్రీడలతోనే సాధ్యం - ముత్యం రెడ్డి మెట్టుపల్లి / ఇబ్రహీంపట్నం మార్చ్ 14 (ప్రజా మంటలు - దగ్గుల అశోక్): మానసిక పరిపక్వత బావోద్వేగ స్థిరత్వం క్రీడల వల్లే సాధ్యం అవుతుందని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్య రెడ్డి అన్నారు. జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలను ప్రారంభించిన ముత్తయ్య రెడ్డి, క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థినీ విద్యార్థులు చదువులో మానసిక...
Read More...
Local News  State News 

ధర్మపురిలో శ్రీయోగానంద నరసింహుని తెప్పోత్సవ, డోలోత్సవం

ధర్మపురిలో శ్రీయోగానంద నరసింహుని తెప్పోత్సవ, డోలోత్సవం వైభవంగా ధర్మపురి యోగానందుని తెప్పోత్సవం    (రామ కిష్టయ్య సంగన భట్ల          9440595494)    ప్రసిద్ధ ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్స వాలలో భాగంగా శుక్ర వారం సాయంత్రం నుండి రాత్రి వరకు బ్రహ్మ పుష్కరిణిలో నిర్వహించిన శ్రీయోగానంద నరసింహుని తెప్పోత్సవ, డోలోత్సవ కార్యక్రమాలు వైభవోపేతంగా జరిగాయి. ఏటా సాయంత్రం నిర్వహించే స్వామి వారి తెప్పోత్సవ, డోలోత్సవాలసభ్యుల...
Read More...
Local News  State News 

అల వైకుంఠపురం...ఇల ధర్మపురి.. భక్తజన సంద్రమైన క్షేత్రం

అల వైకుంఠపురం...ఇల ధర్మపురి.. భక్తజన సంద్రమైన క్షేత్రం   (రామ కిష్టయ్య సంగన భట్ల)   ధర్మపురి క్షేత్రం బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా, శుక్ర వారం నిర్వహించిన శ్రీ యోగానంద నృసింహుని తెప్పోత్సవ, డోలోత్సవాల సందర్భంగా, అపర వైకుంఠపురియై అలరారింది. రాష్ట్రంలోని మారుమూలల నుండే గాక, రాష్టేతర ప్రాంతాల నుండి జానపదుల బృంద గానాలు, భగవన్నామ స్మరణలు, జయజయ ధ్వనాలు, మంగళ వాద్యాలు, భక్తి సంగీతాలు మమేకమై  బ్రహ్మోత్సవ...
Read More...
Local News 

జాతర ఉత్సవములో పాల్గొని పూజలు నిర్వహించిన పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత

జాతర ఉత్సవములో పాల్గొని పూజలు నిర్వహించిన పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత    రాయికల్  మార్చి 14 ( ప్రజా మంటలు) వీరితో పాటు బి.ఆర్.యస్ పార్టీ మండల అధ్యక్షులు బర్కం మల్లేష్, మండల , పట్టణ కో- ఆర్డీనేటర్ తురగ శ్రీధర్ రెడ్డి, మాజీ  ఏ ఎం సి ఛైర్మన్ మారంపెల్లి రాణి సాయికుమార్ ,మాజీ ఏ ఎం సి వైస్ ఛైర్మన్ కొల్లూరి వేణు, మాజీ సర్పంచ్...
Read More...
Local News 

హోళి పండుగ అందరికి కొత్త ఉత్సాహం ఇవ్వాలి  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

హోళి పండుగ అందరికి కొత్త ఉత్సాహం ఇవ్వాలి  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల మార్చి 14(   ప్రజా మంటలు)జిల్లా ప్రజలకు ,పోలీసు అధికారులకు, సిబ్బందికి హోలీ పండుగ శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ * జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు      జిల్లా పోలీస్ కార్యాలయంలో హోళీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.  పోలీస్ అధికారులు మరియు సిబ్బంది తో ఉత్సహంగా,...
Read More...
Local News 

జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల ప్రాంతాల్లో  అర్ధరాత్రి జిల్లా ఎస్పీ  ఆకస్మిక తనిఖీ, గస్తీ వివరాల ఆరా

జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల ప్రాంతాల్లో  అర్ధరాత్రి జిల్లా ఎస్పీ  ఆకస్మిక తనిఖీ, గస్తీ వివరాల ఆరా జగిత్యాల మార్చి 14( ప్రజా మంటలు)    అర్ధరాత్రి సమయంలో పోలీసుల పెట్రోలింగ్, గస్తీ పరిస్థితి ఏ విధంగా ఉందని ప్రత్యక్షంగా పరిశీలించారు.   అనంతరం మెట్పల్లి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జీడీ బుక్‌ను పరిశీలించారు. ఆ సమయంలో స్టేషన్‌లో ఉన్న సిబ్బంది వివరాలు, విధులను అడిగి తెలుసుకున్నారు. రాత్రి డ్యూటీ వివరాలపై సిబ్బందిని...
Read More...
Local News 

జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల ప్రాంతాల్లో  అర్ధరాత్రి జిల్లా ఎస్పీ  ఆకస్మిక తనిఖీ, గస్తీ వివరాల ఆరా

జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ ల ప్రాంతాల్లో  అర్ధరాత్రి జిల్లా ఎస్పీ  ఆకస్మిక తనిఖీ, గస్తీ వివరాల ఆరా జగిత్యాల మార్చి 14( ప్రజా మంటలు) జిల్లా ఎస్పీ అశోక్ కుమార్   అర్ధరాత్రి   సమయంలో  జగిత్యాల టౌన్ కోరుట్ల, మెట్పల్లి పోలీస్ స్టేషన్ లలో ని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు.      అర్ధరాత్రి సమయంలో పోలీసుల పెట్రోలింగ్, గస్తీ పరిస్థితి ఏ విధంగా ఉందని ప్రత్యక్షంగా పరిశీలించారు.   అనంతరం మెట్పల్లి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి...
Read More...
Local News 

ధన్వంతరి ఆలయం లో ఘనంగా కుంకుమ అర్చన, హోళి వేడుకలు పాల్గొన్న పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత

ధన్వంతరి ఆలయం లో ఘనంగా కుంకుమ అర్చన, హోళి వేడుకలు పాల్గొన్న పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత జగిత్యాల మార్చి 14( ప్రజా మంటలు)   శుక్రవారం హోళి శుభ సంధర్భంగా ధన్వంతరి ఆలయములో  మాతా ధనలక్ష్మి సేవలో కుంకుమార్చన కార్యక్రమము అంగరంగ వైభవంగా జరిగింది..   కుంకుమ పూజలో 40 మంది మాతలతో అలయ అర్చకులు చిలుక ముక్కు నాగరాజు అధ్వర్యములో అంగరంగ వైభవంగా జరిగింది.  హోలీ పండుగ  సంధర్భంగా మాజి జిల్లా పరిషత్ చైర్మన్...
Read More...
Local News 

ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా పూజలు, పండ్ల పంపిణీ ,యువజన విభాగం చే రక్త దానం

ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా పూజలు, పండ్ల పంపిణీ ,యువజన విభాగం చే రక్త దానం జగిత్యాల13మార్చి (ప్రజా మంటలు)తెలంగాణ ఆడబిడ్డల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన తెలంగాణ రుద్రమదేవి, తెలంగాణ జాగృతి అధినేత్రి,నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కయ్య   జన్మదినాన్ని పురస్కరించుకొని జగిత్యాల ధరూర్ క్యాంపులో గల కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి  జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు నాయకులతో కలిసి కేక్...
Read More...
Local News 

రంగుల పండుగలో బీ కేర్​ ఫుల్​...డాక్టర్​ కళ్యాణ చక్రవర్తి

రంగుల పండుగలో బీ కేర్​ ఫుల్​...డాక్టర్​ కళ్యాణ చక్రవర్తి   * హోలీ సెలబ్రేషన్స్​ లో ఈ జాగ్రత్తలు పాటించండి..  * గాంధీ ఆర్​ఎంవో డాక్టర్​ కళ్యాణ చక్రవర్తి సికింద్రాబాద్​ మార్చి 13 (ప్రజామంటలు) :   నేడు రంగుల పండుగ హోళీ..చిన్న, పెద్ద అంతా ఎంతో హుషారుగా, సంతోషంగా జరుపుకునే రంగుల కేళీ ఇది. అయితే ఇటీవల కాలంలో సహజసిద్దమైన రంగులకు బదులు హానికరమైన రసాయనలతో రసాయన...
Read More...
Local News 

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించండి..

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించండి.. దాని తర్వాతే ఉద్యోగ నియమకాలు చేపట్టండి.. సికింద్రాబాద్​ మార్చి 13 (ప్రజామంటలు) : ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించిన తర్వాతనే ఉద్యోగ నియమకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గురువారం బన్సీలాల్​ పేట లో ఎమ్మార్పీఎస్​ సీనియర్​ నాయకులు మాచర్ల ప్రభాకర్​ ఆధ్వర్యంలో  ఆందోళన నిర్వహించారు. గ్రూప్​ 1, 2, 3, 4 , ఎక్స్​ టెన్షన్​...
Read More...
Local News 

కరెంటు స్పార్క్ తో పసుపు కుప్ప దగ్నం,  

కరెంటు స్పార్క్ తో పసుపు కుప్ప దగ్నం,   ఇబ్రహీంపట్నం మార్చి 13 (ప్రజామంటలు దగ్గుల అశోక్):   మండల పరిధిలోని వర్షకొండ గ్రామంలో బస్టాండ్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కొద్దిగా దూరంలో  తోటలోనికి వెళ్లే 11 కెవి కరెంటు గల వాయర్లు, వాయిర్ల  మధ్యలో జంపర్ వైర్లు  వేసి వేరే ట్రాన్స్ఫార్మర్ కు కరెంటు ఇవ్వడంతో ఆ జంపర్ల మధ్య
Read More...