తెలంగాణలో కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ సంస్థ రూ.10వేల కోట్ల పెట్టుబడి
తెలంగాణలో కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ సంస్థ రూ.10వేల కోట్ల పెట్టుబడి
హైదరాబాద్ జనవరి 22:
దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మరో భారీ పెట్టుబడి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రఖ్యాత కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ (CtrlS Datacenters Pvt Ltd) సంస్థ రూ.10వేల కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో అత్యాధునిక AI డేటాసెంటర్ క్లస్టర్‌ను నెలకొల్పేందుకు ముందుకొచ్చింది.
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పరిశ్రమలు,ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి సమక్షంలో ఉన్నతాధికారులు, కంట్రోల్ఎస్ (CtrlS) సీఈవో శ్రీదర్ పిన్నపురెడ్డి రెడ్డి ఒప్పందాలపై సంతకాలు చేశారు.
కంట్రోల్ఎస్ ((CtrlS) తలపెట్టిన అర్టిఫిషియల్ డేటా సెంటర్ క్లస్టర్ సామర్థ్యం 400 మెగా వాట్లు కాగా, ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 3,600 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్దిలో ఈ డేటా సెంటర్ ఏర్పాటు మరో మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ఐటీ సేవల సామర్థ్యం పెరుగుఉందని, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకోవటం గర్వంగా ఉందని, డేటా సెంటర్ల ఏర్పాటుతో తెలంగాణలో ఐటీ సేవల ప్రమాణాలు మరింత వృద్ది సాధిస్తాయని కంట్రోల్ ఎస్ (CtrlS) సీఈవో శ్రీధర్ పిన్నపురెడ్డి అన్నారు.