భారత రక్షా సమితి ఆధ్వర్యంలో ఘనంగా గురునానక్ జయంతి వేడుకలు.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల నవంబర్ 15 (ప్రజా మంటలు) :
జిల్లా కేంద్రంలోని తహసిల్ చౌరస్తాలో శుక్రవారం మధ్యాహ్నం ఒకటి గంటలకు గురునానక్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి వేడుకలను ఘనంగా జరుపుకున్న భారత్ సురక్ష సమితి నాయకులు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..... హిందువులు కార్తీక మాసాన్ని ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారని, ఈ నెలలో పూజలు, వ్రతాలు, నోములు చేస్తుంటారు. ఇదే మాసంలోని ఈరోజు నవంబర్ 15 తేది కి ఒక ప్రత్యేకత ఉందని అదే గురునాథ్ జయంతి జరుపుకుంటారని అన్నారు. గురునానక్ జయంతి సిక్కులకు ఎంతో ముఖ్యమైన పండుగ. దీనిని సిక్కులు ప్రతి సంవత్సరం కార్తీక పూర్ణిమ రోజున జరుపుకుంటారని.
సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ గురు పౌర్ణమి రోజున జన్మించారని, ఆయన సిక్కుల మొదటి గురువు. గురునానక్ జయంతి సాధారణంగా అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వస్తుంది. సిక్కులు గురునానక్ జయంతి వేడుకలను ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఏ సి ఎస్ రాజు, జిల్లా ప్రధానకార్యదర్శి అక్కినపెళ్లి కాశీ నాదం, జిల్లా కార్యదర్శి సింగం గంగాధర్,నారేందులా శ్రీనివాస్, బండారి మల్లికార్జున్, తునుకి అంజన్న, కస్తూరి లక్ష్మ రెడ్డి,మ్యాన సుధాకర్, సిరిపురం గంగారాం, చీట్ల గంగాధర్, ఎడమల వెంకట్ రెడ్డి,
ప్రసాద్ రావు, విఠల్ , మ్యాడంపెళ్ళి గంగాధర్ , బలిపెళ్ళి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు