ప్రజావాణికి ఆలస్యంగా హాజరైన మున్సిపల్ కమిషనర్ పై ఇన్చార్జి కలెక్టర్ ఆగ్రహం.

On
ప్రజావాణికి ఆలస్యంగా హాజరైన మున్సిపల్ కమిషనర్ పై ఇన్చార్జి కలెక్టర్ ఆగ్రహం.

(సిరిసిల్ల రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల అక్టోబర్ 7 (ప్రజా మంటలు) : 

ప్రతి వారం ప్రజావాణి కార్యక్రమం జిల్లా కేంద్రంలో కొనసాగుతుండగా జిల్లా లోని నలుమూలల నుండి ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవడానికి ప్రజావాణికి రావడం జరుగుతుంది.

కాగా మున్సిపల్ కమిషనర్ ప్రజావాణికి ఆలస్యంగా రావడంతో ఇన్చార్జి కలెక్టర్ కమిషనర్ ను ఉద్దేశించి ఆలస్యంగా రావడం పై పరుష పదజాలం వాడినట్లుగా భావించి మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తాను గ్రూప్ వన్ ఆఫీసర్ నని తనను ఒక అధికారిగా గుర్తించాలన్నట్లుగా ఇన్చార్జి కలెక్టర్ తో మాట్లాడుతూ..... ఆలస్యంగా రావడానికి స్థానిక ఎమ్మెల్యే తో కలిసి డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిశీలనకు వెళ్లినానని తనకు ఇన్చార్జి కలెక్టర్ సిసి ఫోన్ చేయగా తాను ఎమ్మెల్యే తో కలిసి ఉన్నానని సి సి కి సమాచారం తెలిపినానని అయినప్పటికీ తనను ఒకింత బాధ కలిగే విధంగా ఇన్చార్జి కలెక్టర్ ప్రజావాణిలోనే పరుష పదజాలం వాడడం సరికాదని తన వివరణను మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తెలియజేశారు.

Tags