బీసీ కులగణనకై బీసీ సంఘాల డిమాండ్

On
బీసీ కులగణనకై బీసీ సంఘాల డిమాండ్

03-27

హైదరాబాద్ సెప్టెంబర్ 25 ( ప్రజా మంటలు) :  సమగ్ర కుల గణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం ,కొండాలక్ష్మణ్ బాపూజీ ఫౌండేషన్ అధ్వర్యంలో సోమాజీ గూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన బీసీ కమిషన్ తొలి చైర్మన్ బి ఎస్ రాములు మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వేకు సమగ్ర

ఫార్మాట్  రెడీ చేసామని సత్వరం బడ్జట్ విడుదల చేసి యంత్రాంగం మొత్తం బీసీ కమిషన్ అధర్యంలో పని చేయాలని ఆదేశాలు జారీ చేస్తే చాలని అన్నారు. నెలలోపే పూర్తి చేయడం సాధ్యమే. ప్రభుత్వాన్ని కలిసి సంఘాల తరఫున విజ్ఞప్తి చేసి బడ్జెట్ విడుదలను కోరాలని అన్నారు

ఈ సందర్భంగా వివిధ సంఘాల నుండి, వివిధ ప్రాంతాలనుండి వచ్చిన ప్రతినిధులకు బి ఎస్ రాములు, బి పి మండల్ జీవిత చరిత్ర, బి ఎస్ రాములు జీవిత రేఖలు, భారతీయ చరిత్ర శూద్ర దృక్పథం, భారత రాజ్యాంగం ముఖ్యాంశాలు, ఓబీసీలకు అంబేడ్కర్ కాంట్రిబ్యూషన్ పుస్తకాలు ఉచితంగా అంద జేసారు.

తదనంతరం రెండవ సెషన్లో ఎల్ రమణ ఎమ్మెల్సీ, తాజా మాజీ రాజ్య సభ్యులు బీసీ యకులు, ఆర్ కృష్ణయ్య  తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఆర్ కృష్ణయ్య ప్రసంగిస్తూ కుల గణన చేసి ఇచ్చినా ప్రభుత్వాలు ఆమోదించినా బిహార్ లో మధ్య ప్రదేశ్ లో కోర్టు కొట్టి వేసాయి. అందువల్ల ఉద్యమాలు చేయాలి. బీసీ అధికారంలోకి రావాలి. రాజ్యాంగ సవరణ రాజకీయ రిజర్వేషన్లు అమలు చేసుకోవాలి అని పిలుపునిచ్చారు.

Tags