క్రీడలు శారీరక మానసిక దారుఢ్యానికి స్నేహభావానికి దోహదపడతాయి. - చీఫ్ విప్ అడ్లూరి, ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

On
క్రీడలు శారీరక మానసిక దారుఢ్యానికి స్నేహభావానికి దోహదపడతాయి. - చీఫ్ విప్ అడ్లూరి, ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల సెప్టెంబర్ 24( ప్రజా మంటలు) : 

క్రీడలు శారీరక ,మానసిక దారుఢ్యానికి, స్నేహభావానికి దోహదపడతాయని చీఫ్ విప్ అడ్లూరి, శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ అన్నారు.

జిల్లా కేంద్రంలో వివేకానంద మినీ స్టేడియంలో జగిత్యాల జిల్లా స్థాయి ఎస్ జి ఎఫ్ (స్కూల్ గేమ్ ఫెడరేషన్) క్రీడా పోటీల సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి,ఒలంపిక్, ఎస్ జి ఎఫ్ ఫ్లాగ్ ఆవిష్కరణ చేసి, క్రీడలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్ , జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్.

 వక్తలు మాట్లాడుతూ...

క్రీడలు మానసిక శారీరక దారుఢ్యనికి స్నేహ భావానికి దోహద పడతాయన్నారు. ఒలంపిక్ లో భారత పథకాలు నిరాశా జనకంగా ఉన్నయన్నారు.

బీసీసీఐ సహకారం తో హైదరాబాద్ లో అత్యాధునిక స్టేడియం ఏర్పాటు కానుందని సౌత్ కొరియా సహకారం తో స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు జరుగనుందని, అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా మైదానాలు,వసతుల కల్పన..

వివేకానంద మైదానం లో ఓపెన్ జిమ్,రన్నింగ్ ట్రాక్,బాస్కెట్ బాల్ స్టేడియం,పెవిలియన్ ఏర్పాటు చేయటం జరిగిందని,

గతంలో పిల్లలు అనేక రకాల క్రీడలు ఆడేవారని, నేడు మొబైల్ ఫోన్ లకు యువత అలవాటు అవుతుంది...అధిక పొన్ వాడకం చెడు అలవాట్లకు దారితీస్తుందని జగిత్యాల నియోజకవర్గ పరిధిలో క్రీడలకు తన వంతు సహకారం ఉంటుంది అన్నారు ఎమ్మెల్యే..

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్,వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, ఎస్ జి ఎఫ్ జిల్లా సెక్రటరీ లక్ష్మిరాం నాయక్,డి ఈ వో జగన్ మోహన్ రెడ్డి, డి వై ఎస్ఓ డా. రవి బాబు,స్థానిక కౌన్సిలర్ చుక్క నవీన్,కౌన్సిలర్ లు, నాయకులు,క్రీడాకారులు,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags