రాష్ట్ర కార్పొరేషన్ పదవుల నామినేషన్ లో జిల్లా స్థాయి ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాలి. తెలంగాణ జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్ జక్కోజు వెంకటేశ్వర్లు
రాష్ట్ర కార్పొరేషన్ పదవుల నామినేషన్ లో జిల్లా స్థాయి ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాలి. తెలంగాణ జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్ జక్కోజు వెంకటేశ్వర్లు
రాష్ట్ర కార్పొరేషన్ పదవుల నామినేషన్ లో
జిల్లా స్థాయి ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాలి.
తెలంగాణ జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్ జక్కోజు వెంకటేశ్వర్లు
కరీంనగర్ జనవరి 11 :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తొలి, మలి ఉద్యమ కాలంలో అనేక మంది యువకులు, ప్రజాసంఘాల నాయకులు తమ వ్యక్తిగత జీవితాన్ని, ఉపాధిని పక్కన పెట్టి ఎన్నో సంవత్సరాలు ఉద్యమం చేశారని, 1968 నుండి 2014 వరకు వివిధ కాలాలలో, వివిధ రూపాలలో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో నిరంతరం పని చేసిన జిల్లా స్థాయి ఉద్యమ కారులను గౌరవిస్తూ, వీరికి కూడా సమ్మున్నత గౌరవం ఇవ్వాలని తెలంగాణ జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్ జక్కోజు వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
కరీంనగర్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కూడా, 1968-69 మధ్యకాలంలో తెలంగాణ ఉద్యమం కొరకు విద్యాసంవత్సరాన్ని పోగొట్టుకొని, జీవితంలో ఎంతో కోల్పోయిన వారు ఇంకా గుర్తింపుకోరకు పోరాడుతునే ఉన్నారు. తెలంగాణ జనసభ, తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ రచయితల వేదిక పేర ఎన్నో సంస్థలను స్థాపించి, గ్రామ స్థాయిలో తెలంగాణ ఉద్యమానికి భూమిక ఏర్పాటు చేసిన ఎందరో మండల స్థాయిలోనే ఉంది పోయారని, వారిని కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆయన కోరారు. కరీంనగర్ జిల్లాలో మొదటి నుండి వివధ ప్రజా ఉద్యమాలతో మమేకం అయి పనిచేసిన, గురిజాల రవిందర్ రావు,అవూనూరి సమ్మయ్య, సిహెచ్. వి ప్రభాకర్ రావు, ముక్కెర రాజు లాంటి వారి సేవలను ప్రభుత్వం ఉపయోగించుకోవాలని ఉద్యమకారులు కోరుతున్నారు.
రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులు హైదరాబాద్ కేంద్రంగా పనిచేసిన నాయకులకే కాకుండా అన్ని జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో పనిచేసిన ఉద్యమకారులను గుర్తించి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని టీజేఏసీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా చైర్మన్ జక్కొజు వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం జిల్లా స్థాయిలో జేఏసీ, విద్యావంతుల వేదిక, తెలంగాణ జనసభ ల్లో పనిచేసిన వారికి ఎలాంటి కార్పొరేషన్ పదవులు ఇవ్వలేదని తెలంగాణ జేఏసీ లో పనిచేసిన సీనియర్ ఉద్యమకారులను సైతం పక్కనపెట్టి హైదరాబాద్ కేంద్రంగా పనిచేసిన వారికి కార్పొరేషన్ పదవులు అప్పగించారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా స్థాయిలో పనిచేసిన సీనియర్ ఉద్యమకారులను కూడా పరిగణలోకి తీసుకొని ప్రస్తుత ప్రభుత్వం కార్పొరేషన్ పదవులను ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.తెలంగాణ ఉద్యమంలో అనేక మంది జిల్లా స్థాయిలో నియోజకవర్గస్థాయిలో మండల స్థాయిలో కూడా ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో మండల స్థాయిలో కూడా అనేకమంది అనేక కేసులు ఎదుర్కొన్నారని జైలు వెళ్లినవారు, అనేక నిర్బంధాలను ఎదుర్కొని కష్ట నష్టాలకోర్చారనీ ఆయన వివరించారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో పని చేసిన నాయకులు మరియు తొలి దశ, మలిదశ తెలంగాణ ఉద్యమంలో పనిచేసి అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఉద్యమానికి బాసటగా నిలిచిన వారు ఉన్నారని అన్నారు. తెలంగాణ జేఏసీ నాయకత్వం వల్లనే తెలంగాణ ఉద్యమం ముందుకు పోయింది అనే విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజల్ని ఏకతాటిపైకి తీసుకువచ్చి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి రాష్ట్రాన్ని సాధించారనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని కోరారు పదేళ్లుగా నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని , ప్రజల పక్షాన ఉద్యమించిన వారినిగుర్తించి కార్పొరేషన్ పదవులు ఇవ్వాలని నూతన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.