విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ వహించి, నాణ్యమైన విద్యను అందించాలి::జిల్లా కలెక్టర్ 

On
విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ వహించి, నాణ్యమైన విద్యను అందించాలి::జిల్లా కలెక్టర్ 

విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ వహించి, నాణ్యమైన విద్యను అందించాలి::జిల్లా కలెక్టర్ 

విద్యార్థులకు బోధిస్తున్న అంశాల పై ఆరా : పాటశాలలోని వంటశాల, స్టోర్  సందర్శన

సారంగాపూర్ మండల కేంద్రము లోని , కస్సుర్బా  పాఠశాలను,ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
సారంగాపూర్ జూలై( 25 ప్రజా మంటలు) :

విద్యార్థుల విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, నాణ్యమైన విద్యా బోధన చేయాలని జిల్లా కలెక్టర్, బి,సత్య ప్రసాద్ అన్నారు. 

ఈ సందర్భగా 8,9, 10,తరగతుల విద్యార్థులకు ఇంగ్లీషు , బైలజీ, భౌతిక శాస్త్రం. విద్యార్థులకు గణితం,  సబ్జెక్ట్ ల పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రధానోపాధ్యాయురాలిని ఆదేశించారు.

ఇప్పటినుండి 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపి పరీక్షలలో మంచి ఫలితాలు సాధించేలా చర్యలు చేపట్టాలని 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇప్పటినుండి పదవ తరగతి సిలబస్ పై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులను అడిగి పాటలు సరిగ్గా చెబుతున్నారు లేదా అని తెలుసుకున్నారు. ఈసారి ఇంటర్మీడియట్ విద్యార్థులు జిల్లాలో ఉత్తీర్ణత శాతం పెరగాలని సూచించారు.

విద్యార్థులకు  అందిస్తున్న మధ్యాహ్న భోజనం, తయారీ విధానమును స్టోర్ రూమ్ లను పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనము మెనూ ప్రకారం అందించాలని పేర్కోన్నారు. శుభ్రమైన  తాగునీరు కూడా అందించాలని తెలిపారు.పాటశాల ఆవరణలోని , పరిసరాలను స్వయంగా పరిశీలించి ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచే విధంగా తగు చర్యలు తీసుకోనీ, చేయాలని తెలిపారు.

పాఠశాలలోని ఉపాధ్యాయురాల, ఉపాధ్యాయుల వివరాలు అడిగి తెలుసుకుని హాజరు పట్టిక మరియు సాధారణ సెలవు రిజిస్టర్ లను పరిశీలించినారు. 

ఈ కార్యక్రమంలో, ఆర్డిఓ మధు సుదన్, సంబంధిత జిల్లా అధికారులు, ప్రధానోపాధ్యాయురాలు , ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Tags