ఘనంగా హంపి విరూపాక్ష స్వామి శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామి పాదుక పూజ,మహన్యాస పూర్వక రుద్రాభిషేకం

On

కీసర జూలై 18 (ప్రజా మంటలు) :

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ,శ్రీ శారద చంద్రమౌళీశ్వర రుద్ర సేవా పరిషత్ వారిచే రాంపల్లి గ్రామంలో ఘణపురం శ్రీవాణి రాంప్రసాద్ శర్మ స్వగృహంలో గురువారం శ్రీ భువనేశ్వరి విరూపాక్ష పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామి వారి పాదుకాపూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు భక్తుల నుద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. కలియుగంలో భగవన్నామస్మరణకు మించినది ఏదీ లేదని నిరంతరం భగవన్నామస్మరణ చేస్తూ వైదిక క్రతువులు కొనసాగించినట్లయితే ధర్మం నిలబడుతుందని ధర్మం ద్వారానే అన్ని విజయాలు సంప్రాప్తమవుతాయని అన్నారు. అనంతరం మహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు విశేష సంఖ్యలో పాల్గొని స్వహస్తాలతో పరమశివుని పంచామృతాలతో అభిషేకించారు. మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ప్రధాన కార్యదర్శి ఘణపురం శ్రీవాణి రాంప్రసాద్ శర్మలు విచ్చేసిన సేవా సమితి సభ్యులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు.

Tags