కొండోజు నరసింహ చారి హైదరాబాద్ లో చేపట్టిన దీక్షకు మద్దతుగా జగిత్యాల లో దుకాణాల బంద్.
(రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జూన్ 17 (ప్రజా మంటలు) :
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరబాద్ లో స్వర్ణకారుల సంఘం నాయకులు కొండోజు నరసింహ చారి మంగళ వారం చేపట్టిన దీక్షకు మద్దతుగా జగిత్యాల స్వర్ణకారులు దుకాణాలు మంగళవారం ఉదయం 9 గంటలకు నుంచి బంద్ పాటించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...... ఎక్కడో దొంగలు ఎత్తుకొచ్చిన బంగారం మీరు కొన్నారని పోలీస్ అధికారులు స్వర్ణకారులను వేధించడం తగదన్నారు.
దొంగ బంగారం రికవరీ కోసం స్వర్ణకారులను పోలీస్ లు వేధించి అక్రమంగా భారీ మొత్తంలో వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. బంగారం అమ్మడానికి వచ్చిన వ్యక్తి దొంగ నా ... దొర నా .... అతను బంగారం ఎక్కడి నుండి తెచ్చారో మాకు ఎలా తెలుస్తుంది అని వాపోయారు.
గత ప్రభుత్వం మేము ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదన్నారు.
ఈ ప్రభుత్వం అయినా స్పందించి మా సమస్య పరిష్కారం చేయాలని కోరారు.
ఈ నిరసన లో జిల్లాలోని వివిధ ప్రాంతాల స్వర్ణకారులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.