తెలుగు జానపద సాహిత్య పితామహులు బిరుదు.      జానపద సాహిత్యానికి బిరుదు రామరాజు ఎనలేని సేవలు ఏప్రిల్ 16... బిరుదు రామరాజు జయంతి

On
తెలుగు జానపద సాహిత్య పితామహులు బిరుదు.      జానపద సాహిత్యానికి బిరుదు రామరాజు ఎనలేని సేవలు ఏప్రిల్ 16... బిరుదు రామరాజు జయంతి

తెలుగు జానపద సాహిత్య పితామహులు బిరుదు.      జానపద సాహిత్యానికి బిరుదు రామరాజు ఎనలేని సేవలు ఏప్రిల్ 16... బిరుదు రామరాజు జయంతి

 రామ కిష్టయ్య సంగన భట్ల...
      9440595494

 జానపద సాహిత్య రంగంలో ఆచార్య రామరాజు పేరు తెలియని వారుండరు. తెలుగు జానపద సాహిత్యం గురించి ప్రప్రథమంగా డాక్టరేటు పట్టాకోసం పరిశోధన చేసి, దేశ విశ్వ విద్యాలయాలలో జానపద సాహిత్యం పై పరిశోధన లకు ప్రవేశం కలిపించడానికి ప్రేరణ అయినారు రామరాజు. ఆయన పరిశోధన భూమికగా ఇతర విశ్వ విద్యాలయాలలో జానపద సాహిత్యం గూర్చి పరిశోధన ప్రారంభమయింది. తెలుగునాట విశ్వ విద్యాలయాల్లో జానపద సాహిత్య శాఖలను రూపొందించి, వాటిలో తమ పరిశోధనాత్మక రచనలతో, బోధనతో, మార్గ నిర్దేశనంతో ఒకతరం జానపద సాహిత్య పరిశోధకులను, అధ్యాపకులను తయారు చేసిన మార్గదర్శకులు ఆయన. భారతీయ  విశ్వ విద్యాలయాల్లోని ఆదర్శ ప్రాయమైన, అరుదైన మౌలిక పరిశోధకుల్లో ఆయన అగ్రగణ్యులు. 1955లో ప్రచురించ బడిన ఆయన పరిశోధనా గ్రంథం... 'జానపద గేయ సాహిత్యము' తెలుగు జానపద అధ్యయనాలకు విజ్ఞాన సర్వస్వంగా అందుబాటులో ఉంది. 

బిరుదురాజు రామరాజు 1925 ఏప్రిల్ 16 వ తేదీ దేవనూరు గ్రామంలో లక్ష్మీదేవమ్మ, బిరుదు రాజు నారాయణరాజు దంపతు లకు జన్మించాడు. ప్రాథమిక విద్యను హన్మకొండ శివార్లలోని దేవనూరు, మడికొండలలో పూర్తి చేసి, ఉన్నత చదువుల కోసం ఎనిమిదేళ్లపాటు హన్మకొండకు 14 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వచ్చింది. 3వ తరగతి నుండి ఇంటర్మీడియెట్ వరకు ఉర్దూ మీడియంలో చదువుకున్నాడు. మెట్రిక్ చదివేటప్పుడు 11వ ఆంధ్ర మహాసభల సందర్భంగా మహాత్మా గాంధీ వరంగల్ వచ్చినప్పుడు  ఆనాటి సభలలో స్వచ్ఛంద సేవలకు అందించాడు. గాంధీజీతో కలిసి పాదయాత్ర చేశాడు. 1947లో కాంగ్రెస్ సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని జైలు పాలయ్యాడు. చదువు కునే రోజుల్లో  ఆర్యసమాజం ప్రభావానికి లోనైనాడు. నిజాం వ్యతిరేక రాజకీయోద్యమాలలో చురుకుగా పాల్గొన్నాడు. నిజాం కళాశాలలో బి.ఎ. చదువుతున్న సమయంలో దాశరథి కృష్ణమా చార్యతో పరిచయం ఏర్పడింది. కాళోజీ నారాయణరావు, టి.హయగ్రీవా చారి, ముదిగొండ సిద్ద రాజలింగం, జమలాపురం కేశవరావు తదితర యువ నాయకులతో కలిసి రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం, స్టేట్ కాంగ్రెస్ ఉద్యమాలలో పాల్గొని 1947లో మూడు నెలలపాటు కారాగార శిక్ష అనుభవించాడు. 1947-50ల మధ్యకాలంలో నిజాం కళాశాలలో తెలంగాణా విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా పని చేశాడు. బి.ఎ.పూర్తయ్యాక న్యాయ శాస్త్రంలో పట్టా పొందాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీలో ఎం.ఎ. చదివే రోజులలో విద్యార్థి నాయకుడిగా గుర్తింపు పొందాడు. ఆ సమయం లో సి.నారాయణ రెడ్డితో కలిసి కొంతకాలం రామనారాయణ కవులు పేరుతో జంట కవులుగా కవిత్వం చెప్పారు. మాడపాటి హనుమంతరావు ఆంధ్రసంఘం నెలకొల్పి దానికి బిరుదురాజు రామరాజును అధ్యక్షుడిగా నియమించాడు. తెలంగాణ రచయితల సంఘానికి తొలి  కార్యదర్శిగా ఉన్నాడు. కాగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డాక ఆంధ్ర రచయితల సంఘంగా మారింది. ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం మార్గ దర్శకత్వంలో తెలుగు జానపద గేయసాహిత్యం అనే అంశంపై పరిశోధన చేసి దక్షిణ భారత దేశంలోనే జానపద సాహిత్యంపై మొట్టమొదటి పి.హెచ్.డి ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి సంపాదిం చాడు. సంస్కృతంలో ఎం.ఎ. చేసి అందులో కూడా డాక్టరేట్ పొందా డు.

ఉస్మానియా విశ్వ విద్యాలయంలో 1951లో ఉపన్యాసకుడిగా చేరి క్రమంగా పదోన్నతుల ద్వారా తెలుగుశాఖకు డీన్‌గా, అధ్యక్షు డిగా విధులు నిర్వర్తించాడు. ఆయన మార్గదర్శకత్వంలో 37 మంది పిహెచ్.డి పట్టాలు పొందా రు. రామరాజు పర్యవేక్షణలో కేతవరపు రామకోటిశాస్త్రి, కోవెల సుప్రసన్నాచార్య, ముదిగొండ వీరభద్ర శాస్త్రి, అక్కిరాజు రమాపతి రావు, అనంతలక్ష్మి, కాళిదాసు పురుషోత్తం, రవ్వా శ్రీహరి వంటి వారు తమ పరిశోధనలు చేసి డాక్టరేట్ పట్టాలను పొందడం గమనార్హం. 1983లో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశాడు.
1994లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం  గౌరవ డాక్టరేట్, 1995లో భారత ప్రభుత్వం నుండి నేషనల్ ప్రొఫెషనల్‌షిప్, 2001లో  సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ వారి శివానంద ఎమినెంట్ సిటిజన్‌ అవార్డ్, 2003లో  శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం,2006/2007లో  పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారి 'విశిష్ట పురస్కారం', 2009లో  సి.పి.బ్రౌన్ అకాడెమీ వారి తెలుగు భారతి పురస్కారం అందుకున్నాడు.

ప్రాచీన సంస్కృతాంధ్ర గ్రంథాల్ని పరిశీలించి, పరిష్కరించి మొదటి సారిగా వెలుగులోకి తేవడానికి విశేష కృషి చేశాడు. సంస్కృతంలో పీహెచ్‌డీ చేసి 'సంస్కృత సాహిత్యానికి ఆంధ్రుల సహకారం' అనే గ్రంథంగా తన వ్యాసాన్ని ప్రచురించాడు. తాళపత్ర గ్రంథాల్ని సేకరించి పలు వ్యాసాల ద్వారా  వాటిని పరిచయం చేశాడు. సంస్కృత భాషా సాహిత్యాలకు ఆంధ్రులు చేసిన సేవను గూర్చి విడిగా ఒక పెద్ద పరిశోధన గ్రంధ రచనే చేశాడు. శరత్ చంద్ర ఛటర్జీ, మున్షీ ప్రేమ్‌చంద్ వంటి అగ్ర రచయితల రచనలను తొలిసారిగా తెలుగులోకి అనువదించి  సాహిత్యాభి మానులకు పరిచయం చేశాడు. ఉర్దూ, హిందీ, ఆంగ్ల  భాషలలో మంచి ప్రావీణ్యం ఉన్న పండితుడు రామరాజు గురు గోవింద్ సింగ్ చరిత్ర,  జాతక కథలను హిందీ నుండి తెలుగులోకి అనువదించాడు. ఉర్దూ-తెలుగు నిఘంటువును కూడా రూపొందిం చాడు. ఆంగ్లంలో  దేశంలోని వివిధ ప్రాంతాలలో అనేక ఉపన్యాసాలు ఇస్తూ, అనేక పుస్తకాలు వ్రాసాడు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు యాభైకి పైగా విశ్వ విద్యాలయాలతో అనుబంధం కలిగి ఉండి, పలు యూనివర్సిటీలకు విజిటింగ్ ప్రొఫెసర్‌గా పని చేశాడు. తెలుగు జానపద అధ్యయనాల గాడ్‌ఫాదర్ గా కీర్తించబడే ఆచార్య రామరాజు, 2010, ఫిబ్రవరి 8 న హైదరాబాదులో మరణించాడు.

Tags

More News...

Local News 

సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల ఏప్రిల్ 1(ప్రజా మంటలు)సన్న బియ్యం పేదల పాలిట వరం అన్నారు శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  పట్టణ 8వ వార్డు బుడగ జంగాల కాలనీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుదారులకు ఉచిత సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ  నిరుపేదలకు...
Read More...
Local News 

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు   జగిత్యాల ఏప్రిల్ 01: బిసి రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్వర్యంలో ఏప్రిల్ 2న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించే బిసిల పోరు గర్జన మహా ధర్నా కార్యక్రమానికి జగిత్యాల జిల్లా బిసి సంక్షేమ సంఘం నాయకులు  తరలివెళ్లారు. ఈ...
Read More...
Local News 

రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు గొల్లపల్లి ఎప్రిల్ 01 (ప్రజా మంటలు)    గొల్లపల్లి మండలం చిల్వకోడూర్ గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర సందర్భంగా ఎడ్ల బండి పోటీలు నిర్వహించారు  ప్రథమ స్థానంలో  దొనకొండ.సుధీర్ శకల్ల గారి పావుతుల బంగారం మూస్క్ నిశాంతిరెడ్డి అందజేశారు   ధ్వితిమ స్థానంలో క్యతం.జితేందర్ జగదేవ్ పేట,  వారికి 10గ్రా వెండి కీర్తిశేషులు దాసరి లచ్చవ్వ -భీమయ్య...
Read More...
Local News 

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్  *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్  *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని *15 ఏండ్లుగా ప్రతి వేసవిలో అన్నదానం, చలివేంద్రం   *ఆదర్శంగా శ్రీనివాస సమాజ సేవ ఛారిటబుల్ట్రస్ట్    సికింద్రాబాద్, ఏప్రిల్ 01 (ప్రజామంటలు) :    వయస్సు పైబడిన కూడ పేద ప్రజలకు సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం చాల గొప్పదని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం సనత్ నగర్ లోని...
Read More...
Local News 

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య 

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య  గొల్లపల్లి ఎప్రిల్ 01 (ప్రజా మంటలు)    గొల్లపల్లి మండల కేంద్రంలో ఎనగందుల జయంతి 25 సం డిగ్రీ వరకు చదివి ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటున్నది. జయంతి గత కొన్ని రోజుల నుంచి కడుపు నొప్పితో  మరియు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతు జీవితంపై విరక్తి చెంది ఇంట్లో కుటుంబీకులు నిద్రిస్తున్న సమయంలో,  రూమ్ లో ఐరన్...
Read More...
Local News 

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య. గొల్లపల్లి ఎప్రిల్ 01 (ప్రజా మంటలు)      గొల్లపల్లి మండలము లోని గోవింద పల్లె గ్రామానికి చెందిన  చెందిన బింగి వెంకటమ్మ 72 సం వృద్ధురాలు కొంతకాలం నుండి  థైరాయిడ్  షుగర్ సంబంధిత వ్యాధులతో బాధ పడుతూ డాక్టర్ల సలహా మేరకు మందులు వాడుతున్నప్పటికీ  20 రోజుల క్రితం వెంకటమ్మకు కడుపులో నొప్పి రాగా, కొడుకు
Read More...
Local News 

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ సికింద్రాబాద్, ఏప్రిల్ 01 ( ప్రజామంటలు ) :    అసలే పేదరికం..ఆపై అనారోగ్య సమస్యలు..శరీరం సహకరించక మద్యలోనే చదువు ఆపేసిన  యువతికి ఓ సంస్థ అండగా నిలిచింది. వివరాలు ఇవి..బన్సీలాల్ పేట డివిజన్ జయనగర్ కు చెందిన డి.దశరథ్, వాణీ ల కుమార్తె పూజిత(17) డయాబెటిక్, థైరాయిడ్ తో బాధపడుతోంది. తన మూడేండ్ల వయస్సు నుంచే...
Read More...

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం 

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం  జగిత్యాల ఏప్రిల్ 1( ప్రజా మంటలు)  జిల్లా కేంద్రం అరవింద్ నగర్ లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో గత ఐదు వారాలుగా ప్రతి మంగళవారం జరుగుతున్న సామూహిక శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం ఈ  మంగళవారం ఐదో వారము కు చేరింది.  ఈనాటి హనుమాన్ చాలీసా పారాయణoలో భక్తులు  విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు...
Read More...
Local News 

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఢిల్లీ/గుంతకల్లు ఏప్రిల్ 1 (ప్రజా మంటలు)*అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో గుంతకల్ కసాపురం దేవాలయ దర్శనం కొరకు శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కూడా అందులో విలీనం చేయవలసిందిగా కోరుతూ వనగుంది విజయలక్ష్మి  బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు.. ఢిల్లీలోని కేంద్ర రైల్వే...
Read More...
Local News 

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం    మార్చి 31 (ప్రజా మంటలు)   జిల్లా కేంద్రం బైపాస్ రోడ్ లోని శ్రీ షిరిడి సాయి మందిరంలో సాయిసప్తాహం ప్రారంభమైంది. ఈరోజు సోమవారం నుండి వచ్చే సోమవారం వరకు అఖండ సాయి నామ సప్తహం జరుగుతుందని, నిర్వాహకులు తెలిపారు. సన్నిధిలో ఒక వెయ్యి ఎనిమిది కలుశాలు స్థాపించి ప్రతిరోజు పూజలు జరుగుతాయని, ఎనిమిదో రోజు మళ్లీ...
Read More...
Local News 

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు గొల్లపల్లి మార్చి 31 (ప్రజా మంటలు):    గొల్లపల్లి మండలం లోని తిర్మలాపుర్ గ్రామంలోనీ శ్రీ స్వయంభూ గుండు మల్లన్న స్వామి ఆధ్వర్యంలో ఎడ్లబండ్లు  పోటీల్లో నిర్వహించారు ఈ పోటీల్లో 16 బండ్లు పాల్గొనగా విజేతలకు    బహుమతులు అందజేశారు మొదటి బహుమతి షేక్ అక్బర్ తిర్మలపూర్ కు బాయిన లక్ష్మి- లక్ష్మయ్య పావుతున్న బంగారం అందజేశారు, ద్వితీయ...
Read More...
Local News 

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు 

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు  గొల్లపల్లి మార్చి 31 (ప్రజా మంటలు):    గొల్లపల్లి మండలం చిలువ్వ కోడూరులోని  శ్రీరామలింగేశ్వర స్వామి  జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి జాతర ఉత్సవాల్లో భాగంగా  సోమవారం రథోత్సవం నిర్వహించారు. ఆలయం నుంచి గ్రామంలోని  ప్రధాన వీధుల గుండా  నిర్వహించిన రథోత్సవాన్ని చూడటానికి మండల నలుమూల గ్రామాల  భక్తులు మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ...
Read More...