బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం
సీతాఫల్మండిలో అంజన్ కుమార్ యాదవ్ దిష్టిబొమ్మ దహనం
సికింద్రాబాద్ ఏప్రిల్ 18 ( ప్రజామంటలు) :
దేశ ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి, అమిత్ షా, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ సారంగపాణి డిమాండ్ చేశారు.
సీతాఫల్మండిలోని శివాజీ విగ్రహం వద్ద జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు అంజన్ కుమార్ యాదవ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ నాయకులు అంజన్ కుమార్ యాదవ్ దయాకర్ లు బిజెపి నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని బీజేపీ నేత మేకల సారంగపాణి పేర్కొన్నారు. బిజెపి నాయకులకు క్షమాపణలు చెప్పకపోతే వారిని సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలలో తిరుగనివ్వమని వార్నింగ్ ఇచ్చారు.
రౌడీల లాగా మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకుల పై వెంటనే కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అంజన్ కుమార్ యాదవ్ ని సికింద్రాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో రెండుసార్లు చిత్తుగా ఓడించిన ఘనత కిషన్ రెడ్డి ది అని అన్నారు. అలాంటి కిషన్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్టీ ఇంచార్జీ కందాడి నాగేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు కృష్ణమూర్తి,కనకట్ల హరి, వేణుయాదవ్, పో చయ్య యాదవ్, ఆకారం రమేష్, వెంకటేష్ గౌడ్, శారదా ఉడుత మల్లేష్, వీరన్న, ప్రకాష్ గౌడ్, ప్రభు గుప్తా,సేతు మహేష్, అంబాల రాజేశ్వరరావు, రాము వర్మ, గణేష్ ముదిరాజ్, ఇవి నరేష్, ఉపేందర్ యాదవ్, సౌందర్య, ఆదర్శ ముదిరాజ్, సింహాచలం బాబు, ఈ ఎల్ ప్రతాప్, ముత్తు మంజుల, పస్తం కుమార్, కరుణాకర్, ఆకుల సంపత్, హంసరాజ్, వినయ్ కుమార్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం.
.jpg)
గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలు

భూ భారతి అవగాహన సదస్సుకు రైతులందరు పాల్గొనాలి - తాసిల్దార్ వరందన్

భవిష్యత్తులో బంగారం ఇంకా పెరిగే అవకాశం ఉంది

యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్ అవేర్నెస్

అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"
