కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను ఆకస్మికంగా సందర్శించిన డిఎంహెచ్ఓ
ముల్కనూర్ పిహెచ్సి పరిధిలోకి మార్చాలని గ్రామస్తుల వినతి
సానుకూలంగా స్పందించిన డిఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య
భీమదేవరపల్లి ఏప్రిల్ 17 (ప్రజామంటలు) :
సోమవారం వంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ ను హనుమకొండ డిఎంహెచ్వో డాక్టర్ ఏ. అప్పయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహిస్తున్న వ్యాధినిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో 30 సం.లు పైబడిన వారికి స్క్రీనింగ్ చేసిన వివరాలను పరిశీలించారు. 5 లబ్ధిదారులకు 14 డోసుల వ్యాక్సినేషన్ చేశారు. మొత్తం 3129 మందిని స్క్రీన్ చేయడం జరిగిందని, అయితే ఆన్లైన్లో సమస్య వలన అందరి వివరాలు నమోదు కాలేదని ఆరోగ్య సిబ్బంది డీఎంంహెచ్ఓ దృష్టికి తీసుకెళ్లారు. ఉపకేంద్ర పరిధిలో గుర్తించిన 298 బిపి,186 షుగర్ వ్యాధిగ్రస్తులు, అలాగే ఇద్దరు టీబి వ్యాధిగ్రస్తులకు సరైన ఫాలోఅప్ సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. మందిర్లో ఇటీవల కొనుగోలు చేసిన మిని రిఫ్రిజిరేటర్ ను పరిశీలించారు. మిని రిఫ్రిజిరేటర్ అందుుబాటులో ఉన్నట్లయితే టి డి , ఏ ఆర్ వి ,ఏ ఎస్ వి వంటి వ్యాక్సిన్ లను ఇక్కడనే భద్రపరచడం వల్ల టి డి లాంటి ఇంజక్షన్ కోసం ప్రజలకు ముల్కనూర్ లేదా వంగరకు పోవాల్సిన ఇబ్బంది ఉండదు అన్నారు. జిల్లా కలెక్టర్ అనుమతితో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో మినీ రిఫ్రిజిరేటర్ అందుబాటులో ఉంచుకోవాల్సిందిగా వైద్యాధికారులకు సూచించారు.
ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ భవన నిర్మాణ స్థలానికి సంబంధించిన సమస్యలను వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు గ్రామస్తులు తమ కొత్తపల్లి ఆరోగ్య ఉపకేంద్రాన్ని వంగర నుండి ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మార్చాల్సిందిగా కోరారు. కొత్తపల్లి నుండి వంగర పిహెచ్సికి వెళ్లాలంటే ఇబ్బందికరంగా ఉందని వారు తెలియజేశారు. ఈ అంశాన్ని పరిశీలించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో Dr . దినేష్ జిల్లా మాస్ మీడియా అధికారి వి అశోక్ రెడ్డి, ఏఎన్ఎం హేమలత ఆశాలు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం.
.jpg)
గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలు

భూ భారతి అవగాహన సదస్సుకు రైతులందరు పాల్గొనాలి - తాసిల్దార్ వరందన్

భవిష్యత్తులో బంగారం ఇంకా పెరిగే అవకాశం ఉంది

యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్ అవేర్నెస్

అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"
