కేంద్ర ప్రభుత్వం వెంటనే బిసి రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలి - బర్ల మణి మంజరి సాగర్
- బిసి మహిళ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బర్ల మణి మంజరి సాగర్
హైదరాబాద్ ఏప్రిల్ 04:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చేసిన తీర్మానం మేరకు కేంద్ర ప్రభుత్వం వెంటనే బిసి బిల్లును ఆమోదించాలని బిసి మహిళ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బర్ల మణి మంజరి సాగర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ లో శుక్రవారంనాడు విలేకరులతో బర్ల మణి మంజరి సాగర్ మాట్లాడుతూ, విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లను 42 శాతం పెంచుతూ సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిసి బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందడం హర్షనీయమనీ, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆమోదించాలని డిమాండ్ చేశారు.
దేశంలో బిసిల జనాభా 60 శాతం ఉంటుందని, అయితే అధికారికంగా ఆ లెక్కలను తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టినట్లుగా దేశవ్యాప్తంగా కుల గణన చేసి జనాభా ప్రాతిపదికన బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. దేశంలో వీలైనంత త్వరగా జనాభా గణనను చేపట్టాలని, జనాభా గణన ఏళ్ల తరబడిగా జరగకపోవడంతో దేశంలోని దాదాపు 14 కోట్ల మంది ప్రజలు జాతీయ ఆహార భద్రత చట్టం ప్రయోజనాలను కోల్పోతున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగే జనాభా గణనలో బిసి కుల గణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు పెంచాలని ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. బిసిల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం బిసిలకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి రూ. 50 వేల కోట్ల నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ శాఖలలో ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. కేంద్ర స్థాయిలో 2 లక్షల కోట్ల బడ్జెట్ బిసి సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, పార్లమెంటులో బిసి బిల్లును ప్రవేశపెట్టి చట్ట సభల్లో 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని బిసి మహిళ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బర్ల మణి మంజరి సాగర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో బిసి మహిళ సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మక్తాల శైలజా గౌడ్, శృతి గౌడ్, మహిళ సంక్షేమ సంఘం నాయకురాళ్ళు తారకేశ్వరీ, దీపాదేవి గౌడ్, శ్రీదేవి, గంగం జలజ, సుజాత, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సంబరాలతో అంబరాన్ని అంటిన జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీ విస్మయం - 2K25 వార్షికోత్సవ వేడుకలు

సన్న బియ్యం పంపిణీ లో పాల్గొన్న ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ఇబ్రహీంపట్నంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి.

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న భజన మందిరం పరిశీలించిన ఆలయ ఈవో సురేందర్

బోలక్ పూర్ స్కూల్‌లో గ్రాండ్ పేరెంట్స్ సెలబ్రేషన్స్

సమానత్వ ఉద్యమానికి నిలువెత్తు ఉదాహరణ డా. బాబు జగ్జీవన్ రామ్

డా. బాబు జగ్జీవన్ రామ్ జీవితం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా నిలవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ప్రభుత్వం మారినా...! పాలకులు మారినా.....!!

బుగ్గారం పట్టణ నూతన ముస్లిం కమిటీ ఏకగ్రీవం

శ్రీ సూర్య ధన్వంతరి ఆలయంలో ఘనంగా కుంకుమ పూజలు

శాంతి భద్రత పరిరక్షణలో సీసీ కెమెరాలు అతి ముఖ్యమైనవి - సిఐ,రామ్ నరసింహారెడ్డి

హనుమాన్ జయంతి సన్నాహక సమావేశం.
