అజాగ్రత్తగా వాహనం నడిపిన కేసులో నిందితుడికి 1 సంవత్సరం జైలు శిక్ష,5000 రూపాయల జరిమాన * బాదితుడికి 1,00,000 రూపాయల పరిహారం
జగిత్యాల ఏప్రిల్ 4 (ప్రజా మంటలు)
సారంగాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోనాపూర్ గ్రామానికి చెందిన కసాది చంద్రయ్య అనే వ్యక్తి గొర్రెలు కాస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు తేదీ 14 -02 -2017 రోజున ఉదయం గొర్రెలను మేపుకొని సాయంత్రం 7 గంటల సమయం లో తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో కోనాపూర్ గ్రామ శివారులో గల ఎల్లమ్మ దేవాలయం వద్దకు వచ్చేసరికి సారంగాపూర్ వైపు నుండి వస్తున్న MH 12CK 4931 అనే క్వాలిస్ వాహన డ్రైవర్ సంతోష్ వయస్సు 33 సంవత్సరాలు, అదిలాబాద్ జిల్లా కి చెందిన వ్యక్తి అతివేగంగా అజాగ్రత్తగా నడిపి ముందు నుండి వెళ్తున్న గొర్రెలను డీకొట్టగా సంఘటన స్థలంలో 12 గొర్రెలు మరణించగా మరికొన్ని గొర్రెలకు తీవ్రంగా గాయాలు కావడం జరిగింది.ఇట్టి విషయం గురించి కసాది చంద్రయ్య సారంగాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్.ఐ రణధీర్ నిందితుడి పై కేసు నమోదు చేసి విచారణ జరిపి ఛార్జ్ షీటు దాఖలు చేశారు.
కోర్టు కానిస్టేబుల్ సురేష్ సాక్షులను ప్రవేశపెట్టగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ M.రజని తమ వాదనలు వినిపించగా సాక్షులను విచారించిన గౌరవ న్యాయమూర్తి శ్రీ వినీల్ కుమార్ సెకండ్ అడిషనల్ జె ఎఫ్ సి ఏం నిందితుడికి 1 సంవత్సరం జైలు శిక్ష,5000/- వేల రూపాయల జరిమాన విధిస్తూ, బాధితుడికి 1,00,000/- వేల రూపాయల పరిహారం ఇవ్వాలని తీర్పునిచ్చారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పంపిణీ లో పాల్గొన్న ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ఇబ్రహీంపట్నంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి.

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న భజన మందిరం పరిశీలించిన ఆలయ ఈవో సురేందర్

బోలక్ పూర్ స్కూల్‌లో గ్రాండ్ పేరెంట్స్ సెలబ్రేషన్స్

సమానత్వ ఉద్యమానికి నిలువెత్తు ఉదాహరణ డా. బాబు జగ్జీవన్ రామ్

డా. బాబు జగ్జీవన్ రామ్ జీవితం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా నిలవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ప్రభుత్వం మారినా...! పాలకులు మారినా.....!!

బుగ్గారం పట్టణ నూతన ముస్లిం కమిటీ ఏకగ్రీవం

శ్రీ సూర్య ధన్వంతరి ఆలయంలో ఘనంగా కుంకుమ పూజలు

శాంతి భద్రత పరిరక్షణలో సీసీ కెమెరాలు అతి ముఖ్యమైనవి - సిఐ,రామ్ నరసింహారెడ్డి

హనుమాన్ జయంతి సన్నాహక సమావేశం.

కేంద్ర ప్రభుత్వం వెంటనే బిసి రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలి - బర్ల మణి మంజరి సాగర్
