బీజెపి నాయకులారా! స్థాయికి మించి మాట్లాడితే ఖాబర్దార్ !!
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిట్టెంపల్లి ఐలయ్య, మాజీ అధ్యక్షులు ఊసకోయిల ప్రకాష్
భీమదేవరపల్లి మార్చి 7 (ప్రజామంటలు) :
మంత్రి పొన్నం ప్రభాకర్ పై మండల బిజెపి నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోని దమ్ముంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు గాని, హుస్నాబాద్ నియోజకవర్గంలో కాని ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని మండల కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.అంతేకానీ మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గెలిచామని, తెలంగాణ కోసం వీర పోరాటం చేసిన మంత్రి పొన్నంపై వ్యంగ్యంగా స్థాయికి మించి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి 20వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. మొన్న గెలిచిన గెలుపు బిజెపి పార్టీది కాదని అది బిజెపి బీఆర్ఎస్ చీకటి ఒప్పందానికి నిదర్శనమని దుయ్యబట్టారు. మీకు దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడాలని, కేంద్ర మంత్రిగా బండి సంజయ్ రాష్ట్రానికి ఏం చేశారని అన్నారు. రాష్ట్ర మంత్రిగా పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని సందేహం ఉంటే బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఐలయ్య, మాజీ మండల అధ్యక్షులు ఊసకోయిల ప్రకాష్, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి గజ్జెల రమేష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు జక్కుల అనిల్ యాదవ్, మాజీ ఎంపీటీసీలు గనవేని కొమురయ్య, బొల్లంపల్లి రమేష్, చిట్కూరి రామచంద్రం సీనియర్ నాయకులు ఎదులాపురం తిరుపతి, గొల్లపల్లి రవీందర్,గ్రామ శాఖ అధ్యక్షుడు భాష, ఎన్ఎస్ఈ నాయకుడు తాళ్ల అరవింద్ గ్రామ శాఖ అధ్యక్షుడు సయ్యద్ భాష ,గాడిపల్లి హరీష్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అనాధ పిల్లలైనా రెండు కుటుంబాలకు రూ.10 వేలు అందించిన సూరజ్ శివ శంకర్
.jpeg)
ఆన్లైన్ లో సట్టా నిర్వహిస్తున్న గ్యాంగ్ ఆటకట్టు

మిషన్ భగీరథ నీళ్ళు - మురికి కాలువల పాలు

లోకాయుక్త జడ్జిమెంట్, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు బే ఖాతర్ - జి.పి. నిధుల దుర్వినియోగంపై చర్యల్లో నిర్లక్ష్యం

డబ్బా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి బ్లెస్సికా కీ మెడల్ మరియు నగదు బహుమతి -అభినందనలు

నాణ్యమైన సన్నం బియ్యం పంపిణీ.

ఆడుకోడానికి బయటకి వెళ్లి తిరిగిరాని బాలుడు

ఎమ్మెల్యేకు రంజాన్ ఉగాది శుభాకాంక్షలు వెల్లువ

ఇది ప్రజాపాలన కాదు ప్రజలను, మూగజీవాలను హింసించే పాలన జెడ్పీ పూర్వ చైర్ పర్సన్ దావా వసంత

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు ఘన నివాళి - జిల్లా అదనపు కలెక్టర్ బి. ఎస్. లత

శాంతి భద్రత ల దృష్టిలో జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
