సమరసత వేదిక క్యాలెండర్ ఆవిష్కరణ.
జగిత్యాల జనవరి 17 (ప్రజా మంటలు)
సామాజిక సమరసత వేదిక జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో స్థానిక గీత గ్రంథాలయంలో శుక్రవారం సమరసత క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సమరసత వేదిక జిల్లా అధ్యక్షులు చిట్ల గంగాధర్ మాట్లాడుతూ
రాణి అహల్యాబాయ్ హోల్కర్ త్రి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సామాజిక సమసరసత వేదిక ఆధ్వర్యంలో
సమరసత మూర్తుల చిత్రాలతో కూడిన క్యాలెండర్ ను రూపొందించడం జరిగిందన్నారు. సమాజంలోని అన్ని కులాలు, వర్గాల మధ్య సామరస్యాన్ని సాధించడంలో విశేష కృషిచేసిన వ్యక్తుల జీవితాలను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, గౌతమ బుద్ధుడు, దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, సావిత్రిబాయి పూలే, సంత్ రవిదాస్ లాంటి సంఘసంస్కర్తల జీవిత చరిత్రను నేటితరం కు అందించి తద్వారా సమాజంలో సమరసత భావాన్ని పెంపొందించడం కోసం సమరసత వేదిక ఆధ్వర్యంలో వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆకుతోట వెంకటరమణారెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షులు కనికరం లచ్చన్న, అధ్యక్షులు చిట్ల గంగాధర్, ప్రధాన కార్యదర్శి భూమారెడ్డి, కన్వీనర్ సంపూర్ణ చారి, సూర్యనారాయణ, పురుషోత్తం మహిపాల్ రెడ్డి, తోగిటి గంగాధర్, శ్రీనివాస్, బెక్కం మల్లేశం తదితరులు పాల్గొన్నారు.