SAY NO TO RAGGING.ర్యాగింగ్ చేయడం చట్టరీత్య నేరం. - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల నవంబర్ 22 (ప్రజా మంటలు) :
పట్టణము లో గల ప్రభుత్వ వైద్య కళాశాలలో మహిళల రక్షణ,ఈవ్ టీజింగ్,ర్యాగింగ్, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలపై విద్యార్థిని విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరై దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...
విద్యార్థిని, విద్యార్థులు ర్యాగింగ్, గంజాయి, డ్రగ్స్ లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఉత్తమ డాక్టర్లుగా ఎదిగి జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలకు మంచి పేరు తీసుకరావలన్నారు. విద్యాసంస్థల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేసి ర్యాగింగ్ మొదటి దశలోనే కట్టడి చేయాలని,కలశాల యాజమాన్యాలు విద్యార్థుల అలవాట్లను, నడవడికను ఎప్పటికప్పుడు గమనించాలని తెలిపినారు.
విద్యార్థులు ర్యాగింగ్ చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని,తోటి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడం,వారిని ఇబ్బందులకు గురి చేయడం మంచి విద్యార్ధి లక్ష్యం కాదు అని తెలిపినారు.
విద్యార్థులు సీనియర్స్, జూనియర్స్ అనేది లేకుండా స్నేహపూర్వకంగా కలిసి మెలిసి విద్యనభ్యసించి ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని సూచించారు.
ర్యాగింగ్ చేయడం నేరమని,ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.ర్యాగింగ్ కు పాల్పడే వారి వివరాలను డయల్ 100 కు తెలియజేసి సమాచారం అందించాలన్నారు.
గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలాంటి వ్యసనాలకు బానిసై విద్యార్థులు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, తల్లిదండ్రులు మీ పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.
ముఖ్యంగా విద్యార్థినిలు మౌనం విడి ముందుకు వచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలని,నిర్భయంగా ముందుకు వచ్చి మీ సమస్యలను చెప్పుకున్నాప్పుడే మరింత భద్రత కల్పించగలువుతామని,మహిళలు,విద్యార్థినిలు జిల్లా షీ టీమ్ కు పిర్యాదు చేసినచో చట్టపరమైన చర్యాలు తీసుకోవడం జరుగుతుంది అని అన్నారు.పిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. ప్రస్తుత కాలంలో సైబర్ మోసాలు ఎక్కువ అయ్యాయని వీటిపై ప్రతి ఒక్క విద్యార్థికి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
ఈ సమావేశంలో డిఎస్పీ రఘు చందర్, టౌన్ ఇన్స్పెక్టర్ వేణు గోపాల్, ప్రిన్సిపాల్ సయ్యద్ సైఫుల్లా ఖాద్రి కళాశాల విద్యార్థిలు పాల్గొన్నారు.